బిజినెస్

ఒక్కరు చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: నగరాలు, పట్టణాల్లో ఉద్యోగాలు చేసే మహిళల్లో 35 శాతం మంది ఒక సంతానానికే పరిమితమవుతున్నారు. పిల్లలను కనడం, పెంచడం, ఆర్ధిక భారం వల్ల నగరాల్లో మహిళలు రెండో డెలివరీకి వెళ్లడం లేదు. ఈ సర్వేను అసోచామ్ సోషల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సంస్ధ నిర్వహించింది. ప్రతి ఏడాది మే 2వ తేదీన తల్లుల దినోత్సవాన్ని పాటిస్తారు. ఆ రోజు తమ సంస్ధ శాంపిల్ సర్వే నిర్వహించిందని అసోచామ్ పేర్కొంది. ఆధునిక జీవితం, పెళ్లిళ్లలో వత్తిళ్లు, ఉద్యోగ వత్తిడి, పిల్లలను పెంచడంలో ఆర్ధిక భారం తదితర కారణాల వల్ల ఒక డెలీవరికి తల్లులు పరిమితమవుతున్నారు. 1500 మంది తల్లులపై తమ సంస్ధ సర్వే జరిపిందన్నారు. అహమ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్‌కొత్తా, లక్నో, ముంబాయి తద్తిర నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. 500 మంది తల్లులు మరో డెలీవరీకి వెళ్లమన్నారు. దీని వల్ల తమ ఉద్యోగం, పదోన్నతులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఇద్దరు పిల్లలను కంటే ఏ ఒక్కరిపైనా శ్రద్ధ వహించలేమన్నారు. ఒక సంతానానికి పరిమితమవుదామన్న ప్రతిపాదనకు తమ భర్తలు అంగీకరించడం లేదన్నారు. ప్రసూతి సెలవును రెండోసారి వినియోగించుకుంటే కూడా పదోన్నతిపైన ప్రభావం ఉంటుందని మహిళలు జంకుతున్నారు. కొంత మంది తల్లులు ఏక సంతానాన్ని ప్రోత్సహించేందుకు పన్ను బెనిఫిట్లను కేంద్రం ఇవ్వాలంటున్నారు. 65 శాతం మంది తల్లులు మాత్రం ఒక సంతానానికి పరిమితమైతే భవిష్యత్తులో అబ్బాయి లేదా అమ్మాయి ఒంటరితనానికి లోనవుతారని, ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారని సర్వేలో వెల్లడైంది.