మహబూబ్‌నగర్

రైతును రాజు చేయడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, మే 14: రైతును రాజును చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఒబులాయపల్లి గ్రామంలో రైతు అవగాహన సదస్సులోయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుల మందులను వాడకం వల్ల లాభం కంటే నష్టమే అధికమవుతుందని తద్వారా సేంద్రియ ఎరువుల ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పూర్తిగా విస్మరించాయని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులు పండించే పంటకు విత్తనాలు కొనే దగ్గర నుండి పంటను అమ్ముకుని గిట్టుబాటు ధర పొందేవరకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. రైతులు పండించిన దాన్యానికి గిట్టుబాటు ధర రాకుంటే వాటిని భద్రపర్చుకునేందుకు పెద్ద ఎత్తున గోదాంలను నిర్మించారని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ బండాగారంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, నాయకులు రవీందర్‌రెడ్డి, రాజేశ్వర్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసులు, బెక్కెం జనార్థన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎండ ప్రచండం.. మూగజీవుల రోదన..
గద్వాల, మే 14: రోజురోజుకు ఎండతీవ్రత అధికముతుంది. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో మనుషులే కాక పశుపక్షాదులు, జీవాలు సైతం విలవిలలాడుతున్నాయి. ఎండకు జీవాలు, పక్షులు ఉన్నచోటే మృత్యువాతపడుతున్నాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న కులవృత్తుల వారు ఎండకు మృత్యువాతపడుతున్న జీవాలను చూసి భోరున విలపిస్తున్నారు. ఎండలో తాగునీటితో పాటు, సేదతీర్చుకోవడానికి కనీసం నీడ కూడా దొరకక మానవుడితో పాటు మూగ జీవులు కూడా అలాడిపోతున్నాయి. ఆదివారం కేటిదొడ్డి మండలం కేంద్రంలో ఓ చెట్టు కింద మధ్యాహ్నం ఒంటిగంటకే మూగజీవాలు ఎండవేడి తట్టుకోలేక చెట్టు కింద జీవాలను కాపరులు సేద తీర్చుతున్న దృశ్యాన్ని ఆంధ్రభూమి తన కెమెరాలో బంధించింది.