కరీంనగర్

విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 15: ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను అధికారులు ప్రాధాన్యతగా పరిశీలించి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఆయేషామస్రత్ ఖానం అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ఆమె ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుండి ప్రజలు ఫోన్ చేసి వారివారి సమస్యలను డిఆర్‌ఓకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా రామడుగు మండలం దేశరాజుపల్లి నుండి నర్సయ్య ఫోన్ చేసి సాదాబైనామా విచారణ చేయలేదని డిఆర్‌ఓ దృష్టికి తీసుకురాగా, సాదా బైనామాల విచారణలు పూర్తయ్యాయని, వీటికి సంబంధించిన నోటీసులు తహశీల్దార్లు పంపారని, ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ధేశించిందని, తహశీల్దార్‌ను సంప్రదించాలని నర్సయ్యకు సూచించారు. జమ్మికుంట మండలం మర్రిపల్లి నుండి స్వామి ఫోన్ చేసి నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని డిఆర్‌ఓకు ఫిర్యాదు చేయగా, దీనిపై వీణవంక ఇఓపిఆర్‌డిని విచారణ అదికారిగా నియమించామని తెలిపారు. జమ్మికుంట నుండి ఆడెపు రాజు ఫోన్ చేసి ఇందిరమ్మ బిల్లులు చెల్లించాలని డిఆర్‌ఓను కోరగా, మండలం నుండి రిపోర్ట్ రాగానే చెల్లిస్తామని తెలిపారు. రామహనుమాన్‌నగర్‌కు చెందిన రమేష్ ఫోన్ చేసి గ్రామంలో రోడ్లు అసంపూర్తిగా వేశారని డిఆర్‌ఓ దృష్టికి తీసుకురాగా, వాటిని పూర్తి చేసేందుకు ఇఇపిఆర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ రాజాగౌడ్, సిపిఓ సుబ్బారావు, వ్యవసాయ శాఖ జెడి శ్రీ్ధర్, డిసిఓ అంబయ్య, డిఇఓ రాజేష్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కులవృత్తులు కాపాడటంపై సిఎం దృష్టి
* ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ
కమాన్‌పూర్, మే 15: కనుమరుగై పోతున్న కుల వృత్తులను కాపాడడం పై సిఎం కెసిఆర్ దృష్టి సారించి దానిని అనుగుణంగా పలు పథకాలను ప్రవేశ పెడుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సొమారపు సత్యనారాయణ అన్నారు. గొల్ల కురుమలకు ప్రభుత్వ పరంగా ఇచ్చే గొర్రెల యూనిట్ల లాటరీ కార్యక్రమాన్ని సోమవారం అంతర్గాం మండలంలోని ముర్మూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాటరీలు తీసి గొల్ల కురుమలకు యూనిట్లను అందజేశారు. కార్యక్రమంలో జెడి రాజయ్య, జడ్పిటిసి సంధ్యారాణి, సర్పంచ్ సుధాకర్, ఎంపిడి ఓ ఆకుల సంజీవ రావు, తహశీల్దార్ హన్మంత రావు, డాక్టర్ శ్రావణ్ కుమార్, యాదవ సంఘం జిల్లా కార్యదర్శి ఎలుక కొంరయ్య యాదవ్, అంతర్గాం మండల అధ్యక్షులు మెరుగు పోచయ్య యాదవ్, పవన్, నక్క కొంరయ్య, తదితరులు పాల్గొన్నారు.