రాష్ట్రీయం

అదుపులో అస్ఘర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: బెంగళూరు శివార్లలో తలదాచుకుంటున్న కరడుగట్టిన గజ ఉగ్రవాది అస్ఘర్ స్థావరంపై తెలంగాణ పోలీసులు శనివారం దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించారు. 2008 అహమ్మదాబాద్ పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అస్ఘర్ ఇండియన్ ముజాహిదీన్ సంస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బెంగళూరు తూర్పు జిల్లాలో మాదివలా సబ్ డివిజన్ పరిధిలో పరప్పన అగ్రహార పోలీసు స్టేషన్ సర్కిల్‌లో ఈ ఘటన జరిగింది. ఘటనలో అస్ఘర్‌ను పట్టుకోవడానికి వెళ్లిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసు శ్రీనివాస్‌పై అస్ఘర్ దంపతులు ఎదురుదాడి చేసి కత్తితో రెండుసార్లు పొడిచారు. ఆపరేషన్‌లో ఎనిమిది మంది పోలీసులు పాల్గొన్నారు. అనంతరం అస్ఘర్‌ను పట్టుకున్న పోలీసులు బెంగళూరు పోలీసులకు తదుపరి దర్యాప్తు నిమిత్తం అప్పగించారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్న రాష్ట్రాలు గత కొనే్నళ్లుగా అస్ఘర్ కోసం గాలిస్తున్నాయి. అనేకసార్లు పోలీసుల కళ్లుగప్పి ఉగ్రవాది తప్పించుకుంటున్నాడు. ఎట్టకేలకు పక్కా సమాచారంతో బెంగళూరుకు వెళ్లిన తెలంగాణ పోలీసులకు అస్ఘర్ దొరికారని తెలంగాణ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అహమ్మదాబాద్ పేలుళ్ల కేసులో 56మంది మరణించారు. అస్ఘర్ భార్య వద్ద ఒక రైఫిల్, రిపబ్లిక్ డేకు సంబంధించిన ఉత్సవాల మ్యాప్ ఉన్నట్టు కనుగొన్నామన్నారు. సిరియాలోని ఐసిస్ చీఫ్ యూసుఫ్ అలియాస్ షఫీ ఆర్మర్‌తో అస్ఘర్ సంబంధాలు కలిగి ఉన్నాడని తమ దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అస్ఘర్ తన భార్యతో కలిసి పరప్పన అగ్రహార పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో ఉంటున్నాడు. అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులతో ఉగ్రవాద దంపతులు తలపడ్డారు. దాడిలో గాయపడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ కోలుకుంటున్నాడని, ప్రాణానికి ముప్పేమీ లేదని బెంగళూరు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్‌ను స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ పోలీసు స్టేషన్ పరిధిలో ఉగ్రవాద అనుమానితులను పట్టుకోవడానికి వెళ్లిన తెలంగాణ పోలీసుల మీద దాడి జరిగిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.