ఆంధ్రప్రదేశ్‌

రేణిగుంట ఎస్‌బిఐ ఏటిఎంలో రూ.15 లక్షల మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జనవరి 23: పట్టణం నడిబొడ్డున ఎన్‌టిఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఎస్‌బిఐ ఏటిఎంలో 15.80లక్షల రూపాయలు మాయం అయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈసంఘటనలో అనుమానం ఉన్న అక్కడ పని చేసే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఎస్‌బిఐ ఏటిఎంలో గత శనివారం ఉదయం సంబంధిత సిబ్బంది 20 లక్షల రూపాయలు నగదును ఉంచారు. ఆదివారం అందులోనుంచి 15 లక్షల 80 వేల రూపాయలు చోరీకి గురయ్యింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే చోరులు 500 రూపాయల నోట్లను మాత్రమే తస్కరించారు. ఈ విషయాన్ని ఎస్‌బిఐ బ్యాంకు అధికారులు సోమవారం ఉదయం ఏటిఎంలో ఎంత నగదు ఉన్నదని కంప్యూటర్ ద్వారా తనిఖీ చేయడంతో ఈ చోరీ వ్యవహారం బయట పడింది. అయితే బ్యాంకు అధికారులు ఎక్కడ బ్యాంకు పరువు దెబ్బతింటుందోనని ఈ వ్యవహారాన్ని గోప్యంగా చేపట్టి అంతర్గత విచారణ చేశారు. అయినప్పటికీ ఏటిఎం నుంచి ఎవరు డబ్బు చోరీ చేశారో బయట పడలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం ఏటిఎంలో నగుదును ఉంచే సేఫ్ సెక్యూరిటీ గార్డ్ సంస్థ నిర్వాహకులు రేణిగుంట ఎస్ ఐ మధుసూదన్ రావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ రూట్‌లో పని చేసే ముగ్గురు సెక్యూరిటీ గార్డులైనన రమేష్, గురుప్రసాద్, గిరి ప్రసాద్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. అందుకు కారణం ఏటిఎం మిషన్‌లో నగదు పెట్టే సమయంలో ఉపయోగించే రహస్య సంకేత నెంబర్లు ఆ ముగ్గురికి మాత్రమే తెలియడమే. ఈ ముగ్గురితో సంబంధమున్న మరో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏటిఎం మిషన్ల వద్ద ఎస్‌బిఐ బ్యాంకు అధికారులు ఏర్పాటు చేసిన సిసి కెమేరాలు గత నెల రోజులుగా పని చేయలేదు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఒక పథకం ప్రకారం నిందితులు సిసి కెమేరాలను పని చెయ్యకుండా చేశారా అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరో గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో నిందితులు అదేరోజు చోరీకి పాల్పడడం వెనుక కూడా ఒక పథకం ఉందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఎందుకంటే బ్యాంకు పని దినాల్లో అయితే ఖాతా దారుడు ఏటిఏం నుంచి డబ్బులు డ్రా చెయ్యగానే ఎస్‌బిఐ బ్యాంకు క్యాషియర్ వద్ద ఉన్న కంప్యూటర్లో ఏటిఎంలో ఉన్న నగదును ఎంత తీసుకున్నారో అంత మొత్తం తగ్గుతూ కనపడుతుంది. ఆదివారంనాడు అయితే బ్యాంకు సిబ్బంది ఉండరు దాన్ని గుర్తించే వారు ఉండరు అనే భావంతోనే దొంగలు ఈ చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.