తెలంగాణ

కెటిఆర్ ముని మనవడు కూడా కెసిఆర్ హామీలు తీర్చలేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇస్తున్న హామీలను అమలు చేయాలంటే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాదు కదా ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ముని మనవడు వచ్చినా సాధ్యం కాదని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్, టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన ఈ 19 నెలల కాలంలో ఇప్పటి వరకు 300 రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిందని, ఈ లెక్కన వీరు 2 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలంటే కనీసం 500 సంవత్సరాలు పడుతుందని వారన్నారు. ఇప్పటికే వై-ఫై ఉచితంగా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు అమలు చేయకుండా, ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 3 నెలల్లో అమలు చేస్తామని చెబుతున్నదని వారు విమర్శించారు. ఐటిఐఆర్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తాము అధికారంలో ఉన్నప్పుడు తెచ్చామని, కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా తేలేని మంత్రి కెటిఆర్ అబద్దాలతో కాలం గడుపుతున్నారని వారు విమర్శించారు. 24 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నామని గొప్పు చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్ పాలకులు ఒక్క యూనిట్ కూడా కొత్తగా ఉత్పత్తి చేయకుండా ఎక్కడి నుంచి తెచ్చారని వారు ప్రశ్నించారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ రాజ్యాంగ పదవిని నిర్వహించడం మానేసి రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని వారు విమర్శించారు. గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక, అవినీతి అంశాలపై కూడా దృష్టి సారించి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు.