బిజినెస్

లిథియం బ్యాటరీల తయారీకి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందుకు వచ్చే సంస్థలకు రాయితీలు
కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
బిహెచ్‌ఇఎల్‌తో కలసి ఉత్పత్తికి యత్నాలు
ఎలక్ట్రిక్ వాహన ధరలను తగ్గించడమే ధ్యేయం
రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ‘మారుతీ’ యోచన
భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే వెల్లడి
చైనా సంస్థలకు ఎదురుదెబ్బ ఖాయం

న్యూఢిల్లీ, మే 25: విద్యుత్‌తో నడిచే (ఎలక్ట్రిక్) వాహనాల ధరలను తగ్గించేందుకు వీలుగా దేశంలో లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసే సంస్థలకు ప్రోత్సాహకాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే గనుక జరిగితే భారత మార్కెట్లో ప్రవేశించాలనుకుంటున్న చైనా కార్ల తయారీ సంస్థలకు పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయమై ప్రభుత్వ ప్రణాళికలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే మంగళవారం న్యూఢిల్లీలో వివరిస్తూ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన బ్యాటరీని ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా రీమోడలింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ కోసం 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రభుత్వ రంగంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్‌ఇఎల్)తో కలసి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అలాగే దేశంలోని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ అయిన ‘మారుతీ’ లిథియం బ్యాటరీల తయారీ కోసం 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని ఆయన పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. భారత్‌లో లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ కేంద్రాల ఏర్పాటుకు ముందుకువచ్చే దేశీయ కార్ల తయారీ సంస్థలకు రాయితీలను అందించేందుకు కసరత్తు చేస్తున్నామని, ‘ఫేమ్ ఇండియా’ లాంటి పథకాల ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని, అమ్మకాలను పెంపొందించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోందని అనంత్ గీతే స్పష్టం చేశారు.