ఆంధ్రప్రదేశ్‌

ఆరుగురి దుర్మరణం ... క్వారీలో విరిగిపడిన కొండరాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వారీలో విరిగిపడిన కొండరాళ్లు

శిథిలాల కింద ఛిద్రమైన మృతదేహాలు
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం
మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా

మేడికొండూరు, మే 27: క్వారీలో కొండరాళ్లు విరిగిపడి ఆరుగురు దుర్మరణం పాలైన సంఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం కొండ ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు రోజులుగా వానలు కురుస్తున్న నేపథ్యంలో రాళ్లు నానిపోయి ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమ క్వారీయింగే ఇందుకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఫిరంగిపురంలో క్వారీయింగ్ నిమిత్తం కొండపై బ్లాస్టింగ్ చేసేందుకు శనివారం ఉదయం 8 గంటలకు ఇద్దరు కార్మికులు తాళ్లతో పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. కొండ కింద మరో పదిమంది కార్మికులు పని చేస్తున్నారు. బ్లాస్టింగ్‌కు జిలిటెన్ స్టిక్‌లు పేల్చే సమయంలో బండరాళ్లు దొర్లి, పైకి ఎక్కుతున్న ఇద్దరు కార్మికులు జారిపడ్డారు. వారితోపాటు కింద పనిచేస్తున్న కార్మికులపై కొండరాళ్లు విరిగిపడ్డాయి. ప్రమాదంలో గ్రామానికి చెందిన తెనాలి చినబాలస్వామి (41), పెరికల రాయప్ప (46), బూరగడ్డ నాగరాజు (27), పి శరణు దనవాయి (30), దుర్గం ఆంజనేయులు (46), సంతుల వీరయ్య (39) శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు దుర్గం చినరాజు, మండే సాయిరాం తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే గుంటూరు కలెక్టర్ కోన శశిధర్, జిల్లా ఎస్పీ నారాయణనాయక్ ఫిరంగిపురం చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను ఎఆర్ పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బలగాలు, అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సాయంతో మధ్యాహ్నానికి వెలికితీశారు. మృతదేహాలు గుర్తుపట్టేందుకు వీల్లేని విధంగా ఛిద్రమయ్యాయి. మృతుల కుటుంబాల రోదనతో శ్మశాన వాతావరణం నెలకొంది. మృత దేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బ్లాస్టింగ్ నిర్వహించరాదనే నిబంధన ఉన్నప్పటికీ క్వారీ యజమానులు ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుపుతున్నారని మృతుల బంధువులు, స్థానికులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ క్వారీయింగ్ నిర్వాహకులను తక్షణమే అరెస్టు చేయాలని గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ప్రమాద ప్రాంతాన్ని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు.
సిఎం దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశం
క్వారీ ప్రమాదంపై సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశిధర్‌ను ఫోన్‌లో ఆదేశించారు. అక్రమ క్వారీలపై నిఘాపెట్టి నియంత్రించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.

చిత్రం... ప్రమాదం జరిగిన క్వారీ స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది