తెలంగాణ

పద్ధతి మార్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 27 : జాతీయ సగటు కన్నా మెరుగైన వైద్యాన్ని అందించి ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా వె ద్యులు చర్యలు తీసుకోవాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ మందిరంలో రాష్ట్ర ఆరోగ్య, కు టుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకా టి కరుణ, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలసి జిల్లా వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రభుత్వం ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నా వైద్యులు, సిబ్బంది పనితీరు బాగలేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్ర జలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి సమస్యలు త లెత్తకుండా పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు దృష్టి పెట్టాలని సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల నుంచి వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించనట్లయితే ప్రభుత్వ అనుకున్న లక్ష్యం నేరవేరుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ఏంచేద్దామో చెప్పాలని మంత్రి హరీశ్‌రావు వైద్యుల సూచనలు, సలహాలు కోరారు. ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశాల్లో జిల్లాలో పిహెచ్‌సి కేంద్రాల వారిగా ప్రతి ఒక్క వైద్యుడిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న అమ్మ ఒడి.. కెసిఆర్ కిట్ పథకంలో భాగంగా ఆరోగ్య కుటుం బ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలోని పిహెచ్‌సిల కేందాల వారీగా ప్రసవాలు జరిపిన తీరును సమీక్షిస్తూ మంత్రి వివరించారు. సిద్దిపేట ఎంసిహెచ్ ఆసుపత్రితో పాటు జిల్లాలోని పిహెచ్‌సి కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది పనితీరు వారి సమస్యల పరిష్కారాలపై కమిషనర్ వాకాటి కరుణతో మంత్రి చర్చించారు. జిల్లాలో 11 పిహెచ్‌సి కేంద్రాలు 24 గంటలు పాటు వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. సిద్దిపేట ఎంసిహెచ్‌లో ప్రతి నెల 345 పైచిలుకు ప్రసవాలు జరిగితే, గజ్వేల్ ఎంసిహెచ్‌లో 294 ప్రసవాలు జరిపారన్నారు.
దుబ్బాక నియోజకవర్గంలోని తిమ్మాపూర్ పిహెచ్‌సి కేంద్రంలో 20, ములుగు పిహెచ్‌సిలో 15లో సాధారణ ప్రసవాలు జరిపినందుకు అక్కడి వైద్యాధికారులను, సిబ్బందిని అభినందించారు. వైద్యాధికారులంతా కలసి మెలసి సమష్టిగా పనిచేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సక్రమంగా విధుల్లో హాజరై పేద రోగులకు వైద్యం అందించాలన్నారు. రోగులకు అనుక్షణం అత్యవసర సేవలు అందించాల్సిందిపోయ పనితీరులో తప్పుడు పనులు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని.. మీ పని తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

chitram...సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు