రాష్ట్రీయం

రాయలసీమలో బయల్పడిన బుద్ధపాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 30: ఒకప్పుడు కోస్తా తీరంలో ఊరూవాడా విస్తరించిన బౌద్ధం, త్రిశరణాలతో మారుమోగింది. ఇప్పటిదాకా తీరాంధ్రలోని 13 జిల్లాల్లో దాదాపు 250కి పైగా బౌద్ధక్షేత్రాలు ఒయల్పడిన సంగతి తెలిసిందే. అడపాదడపా అక్కడో, ఇక్కడో ఒక్కోచోట బౌద్ధ ఆనవాళ్లు బయల్పడుతూనే ఉన్నాయి. రాయలసీమలో కూడా ఒక్కో బౌద్ధక్షేత్రం బయపడుతూనే ఉంది. ఇటీవల కడప జిల్లా కాజీపేట మండలంలోని నాగనాథునికోన, ఆంజనేయుని కొట్టాల వద్ద శాతవాహనుల కాలం నాటి బౌద్ధ ఆరామ శిథిలాలు, బుద్ధుని పాదాలు బయల్పడ్డాయని ప్రముఖ బౌద్ధ పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ-అమరావతి సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి మంగళవారం నాడిక్కడ తెలిపారు. కల్చరల్ సెంటర్ ప్రారంభించిన ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పొస్టెరిటీ (్భవిష్యత్తరాలకు వారసత్వాన్ని కాపాడుదాం) పథకంలో భాగంగా మంగళవారం ఆయన నాగనాధునికోన కొండమీద, కొండ కింద ఆంజనేయుని కొట్టాలు వద్దవున్న బౌద్ధ స్థూపాలు, పాదాలను సందర్శించి అవి శిథిలవౌతుండటంపై విచారం వ్యక్తం చేశారు. నాగనాధునికోన గుట్టపై 60 ఇన్‌టు 28 ఇన్‌టు 7 సెం.మీల కొలతల ఇటుకలతో నిర్మించిన కట్టడాలు, వాటిపై సున్నపు గారతో చేసిన తాపడం, రెండు వేల సంవత్సరాల నుండి ఇప్పటిదాకా చెక్కుచెదరకుండా ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకోటానికి నిర్మించిన నేలమాళిగ లాంటి కట్టడం, దాని ముందు ప్రతిష్ఠించిన అష్ట మంగళాలు చెక్కిన బుద్ధపాదాలు ఒకప్పటి బౌద్ధక్షేత్ర వైభవాన్ని తెలియజేస్తున్నాయన్నారు. ఇక్కడ బయల్పడినవి కడపలోని మహావీర ప్రదర్శనశాలకు చేరాయనీ, కడప జిల్లాలో బయల్పడిన ఈ బౌద్ధక్షేత్రం వద్ద రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టాలని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ చరిత్రకారుడు తవ్వా ఓబురెడ్డి ఆంజనేయుని కొట్టాల వద్ద బుద్ధ పాదశిల్పాన్ని భద్రత కోసం కడప మ్యూజియానికి తరలించారన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి వెళ్లారేతప్ప ఈ బౌద్ధ కేంద్రాన్ని కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ, అందువల్ల దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ చారిత్రక ఆనవాళ్లకు హానికలిగిస్తున్నారని స్థానిక ఆర్టీసీ కండక్టర్ రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజీ ఇంజనీర్ చంద్రశేఖరరెడ్డి వాపోయారు.

chitram....
తవ్వకాల్లో బయల్పడిన బుద్ధుని పాదాలు