రాష్ట్రీయం

మరింత లోతుగా.. అవినీతి తవ్వకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి/ శేరిలింగంపల్లి/ వనస్ధలిపురం, జూన్ 2: తెలంగాణను కుదిపేస్తోన్న భూస్కాం రోజుకో మలుపుతిరుగుతోంది. కేసులో రాష్టవ్య్రాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, వీరితో కుమ్మక్కై ప్రభుత్వ భూముల స్వాహాకు పాల్పడిన పెద్దల భాగోతాన్ని రట్టు చేసేందుకు ఏసిబి పరుగులు పెడుతోంది. ఇదిలాఉండగా మియాపూర్ భూముల అవకతవకలపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు సిపి సందీప్ శాండిల్య ప్రకటించారు. నిందితులను విచారించేందుకు కొన్ని రోజులు కోర్టు అనుమతి కోరుతున్నామన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై దర్యాప్తు జరుగుతోందని, ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదన్నారు. నిందితులను కస్టడీకి తీసుకుంటే ఎవరి పాత్ర ఎంతనేది బయట పడుతుందన్నారు. ఇప్పటికే తమ బృందాలు ఆధారాలు సేకరించాయని, ఇంకా సేకరిస్తునే ఉన్నాయన్నారు. ప్రభుత్వం కేసు దర్యాప్తును సిఇడికి అప్పగించిందని, వాళ్లు ఎలాంటి సాయం కోరినా అందించేందుకు సిద్ధమన్నారు. కేసులో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తి కోసం పోలీసులు మూడు బృందాలుగా వేట కొనసాగిస్తున్నారన్నారు.
నిందితులకు బెయిల్ నిరాకరణ
వేల కోట్ల విలువ చేసే మియాపూర్ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ రెవెన్యూ సర్వే నెంబర్లలోని 20, 28, 44, 45, 100, 101లలో ఉన్న రూ.1500 కోట్ల పైగా విలువ చేసే 816.04 ఎకరాల ప్రభుత్వ భూమిని దొడ్డిదారిలో గత ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. నిందితులైన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు, ట్రినిటి ఇన్‌ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పొన్నాకుల సంజీవ పార్థసారధి (పిఎస్ పార్థసారధి), గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటెక్, సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్ పేరుపోతుల వెంకటరామ సంజీవరాయ శర్మ (పివిఎస్ శర్మ)లు దరఖాస్తు చేసుకున్న బెయిలు పిటిషన్‌ను మియాపూర్‌లోని కూకట్‌పల్లి 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తిరస్కరించారు. ప్రభుత్వానికి సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువ చేసే వందలాది ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, నిందితుల్లో చాలామంది ఇంకా పరారీలోనే ఉండడం తదితర కారణాల వల్ల బెయిలు పిటిషన్‌ను జడ్జి కొట్టివేశారు. నిందితుల పాస్‌పోర్టును అప్పగించాలని మియాపూర్ ఏసీపీ సంక్రాంతి రవికుమార్ వేసిన పిటిషన్‌ను జడ్జి ఆమోదించారు. నిందితులు తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది.
యూసుఫ్ బెయిలు వాయిదా
పది వేల కోట్ల పైగా విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ యూసుఫ్ బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదాపడింది. శుక్రవారం ఇరువర్గాల వాదనలు విన్న మియాపూర్‌లోని కూకట్‌పల్లి 24 మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేశారు.
కస్టడీ పిటిషన్‌పై నేడు నిర్ణయం
మియాపూర్ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో నిందితుల నుంచి మరింత సమాచారం తీసుకునేందుకు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌పై నిర్ణయాన్ని శనివారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. పోలీసులు 9ఎంఎం కోర్టులో వేసిన కస్టడీ పిటిషన్‌ను ఇంచార్జి జడ్జి కొట్టివేయడంతో ఎల్‌బి నగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి మిగతా నిందితులను పట్టుకోవడానికి ముమ్మరంగా గాలిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ అరెస్టు
ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకంటే తక్కువగా రేటు చూపించి భూముల అమ్మకాలు జరిపిన కేసులో ఎల్బీనగర్ పోలీసులు బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇప్పటికే మేడ్చల్ సబ్ రిజిస్టార్ రమేష్ చంద్రారెడ్డితోపాటు ఎల్బీనగర్ సిరీస్ చైర్మన్ గోకరాజు సుబ్బరాజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు. శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇన్స్‌పెక్టర్ కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటలో నివాసం ఉంటున్న బుచ్చి బాబు ఎల్బీనగర్ సిరీస్‌కు చెందిన సర్వే నెంబర్ 9, 4 (15463) డాక్యు మెంట్‌లో 5401 గజాల స్థలానికి సంబంధించి తక్కువ మెత్తంలో స్టాంప్ డ్యూటీ చూపించి ప్రభుత్వానికి రావాల్సిన 70 లక్షల రూపాయల ఆదాయాన్ని కొల్లగొట్లారని ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్ కొనుగోలులో మరో నలుగురు వ్యక్తులు నిందితులుగా ఉన్నారని, త్వరలో వారినీ అరెస్ట్ చేస్తామని ఇన్‌పెక్టర్ కాశిరెడ్డి తెలిపారు.