రాష్ట్రీయం

నేడు రాహుల్ గుం‘టూర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 3: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. విభజన అనంతరం గత సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని సంతరింప చేసేందుకు ప్రత్యేక హోదా అంశంతో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన సంగారెడ్డి సభ తరహాలోనే ఏపిలో గుంటూరు సభను విజయవంతం చేసేందుకు నేతలు భారీ జన సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌తోపాటు మరో పది పార్టీలకు చెందిన యూపీఏ భాగస్వామ్యపక్షాల నేతలు బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఆదివారం సాయంత్రం గుంటూరు- పొన్నూరు రోడ్డులోని ఆంధ్ర- ముస్లిం కళాశాల ప్రాంగణంలో బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి, ఎంపి డి రాజా, డిఎంకె నాయకులు, ఎంపి టికెఎస్ ఇలంగోవన్, జెడి (యు) అధ్యక్షులు, కేంద్ర మాజీమంత్రి శరద్‌యాదవ్, ఎంపి జయప్రకాష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు డెరిక్ ఓబ్రెన్‌తో పాటు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వంటి నేతలు హాజరు కానున్నారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలతో పాటు రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు ప్రధానంగా ప్రత్యేకహోదా అస్త్రాన్ని సంధించనున్నారు. ఏపికి విభజన సమయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రత్యేక హోదాను ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఇది సభలో హామీకే పరిమితమైంది. మరో 11 రాష్ట్రాల్లో అంతకుముందే ఈ డిమాండ్ ఉన్నందున ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తేల్చిచెప్పింది. హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ భారీ బహిరంగ సభతో గుంటూరు నుంచి జనంలోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. ఇదిలాఉండగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా హేతుబద్ధత లేకుండా విభజించారంటూ నవనిర్మాణ దీక్షల్లో అధికార తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితుల్లో రాహుల్ ప్రత్యేక హోదా నినాదంతో రాష్ట్రానికి రావటం విశేషం. ఆంధ్ర ముస్లిం కళాశాలలో జరిగే బహిరంగసభ ఏర్పాట్లను ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, పిసిసి కార్యదర్శి మస్తాన్ వలీ, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నేతలు పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ సభను విజయవంతం చేసేందుకు నేతలు జనసమీకరణలో నిమగ్నమయ్యారు. రాష్టవ్య్రాప్తంగా సభకు లక్ష మందికి పైగా జనం తరలి వస్తారని అంచనా.

రాహుల్ గాంధీ రాక సందర్భంగా గుంటూరులో చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తున్న
ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు