రాష్ట్రీయం

విపక్షాల ఐక్యతకు మరో కాంక్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 3: భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని 1983లో అత్యధిక సీట్లతో అధికార పగ్గాలు చేపట్టిన నందమూరి తారక రామారావు అదే ఉత్సాహంతో దేశవ్యాప్తంగా అధికారపక్ష కాంగ్రెసేతర పక్షాలన్నింటిని ఏకం చేసేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా అదే సంవత్సరం విజయవాడలో జరిగిన తొలి మహానాడును తగిన వేదికగా కూడా మలువగల్గారు. ఆ సమయంలో విజయవాడ విటిపిఎస్ అతిధి గృహంలో అతిరథ మహారధులతో అత్యంత కీలక సమావేశం జరిగింది. తిరిగి 1988 ప్రాంతంలో కృష్ణానదీ తీరాన జరిగిన మహానాడును కూడా కాంగ్రెసేతర పక్షాల ఐక్య వేదికగా మలచారు. ఎన్టీఆర్ ఆ సమయంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. తిరిగి 30 ఏళ్ల తర్వాత పొరుగునే ఉన్న గుంటూరు ఎన్డీయేతర పక్షాల సమైక్యత వేదికగా రూపుదిద్దుకోబోతున్నది. ‘ప్రత్యేక హోదా భరోసా’ పేరిట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివారం సాయంత్రం భారీఎత్తున ఏర్పాటుచేస్తున్న బహిరంగ సభకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీతో పాటు వివిధ పక్షాల జాతీయ నాయకులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన చట్టం ఆమోదం సందర్భంగా నాటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ప్రత్యేక హోదాకు నాడు మద్దతు తెలిపిన వివిధ జాతీయ పార్టీల అగ్రనేతలు తరలి వస్తుండటం ప్రత్యేక విశేషం. ఇదే వేదికపైనుంచి విపక్షాలన్నీ కల్సి మరోమారు ఏపికి ప్రత్యేక హోదాను సమర్ధించబోతున్నారు. ఈ సభకు రాహుల్‌తో కల్సి ఢిల్లీ నుంచి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు గన్నవరానికి చేరుకుని రోడ్డు మార్గాన రామవరప్పాడు రింగ్‌లోని కె.హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి రోడ్డుమార్గాన గుంటూరుకు బయలుదేరి వెళతారు.