రాష్ట్రీయం

మన తప్పులే ప్రత్యర్థికి బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 5: హత్య చేసినోళ్లే పూలదండలతో వస్తున్నారని అంటూ, ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని తెదేపా జాతీయాధ్యక్షుడు, సిఎం చంద్రబాబు పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. సోమవారం తన నివాసం నుంచి పార్టీ నేతలు, మండల, జిల్లా, రాష్ట్ర పార్టీ బాధ్యులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైకాపా బలహీనపడటంతో కాంగ్రెస్ బలపడాలని చూస్తోందని రాహుల్‌గాంధీ సభను ఉద్దేశించి అన్నారు. జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన దరిమిలా కొన్నివర్గాల ప్రజలు ఆ పార్టీకి దూరం కావడంతో, దానినుంచి లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ చూస్తోందన్నారు. డిపాజిట్లు కూడా రాని స్థితినుంచి సభజరిపే స్థితికి కాంగ్రెస్ వచ్చిందంటూ, మనం తప్పు చేస్తే ప్రత్యర్థుల నెత్తిపై పాలుపోసినట్టేనని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రతిపక్షం పని అంటూ, ఆ విమర్శలను సమర్థంగా తిప్పికొట్టే బాధ్యత అధికార పార్టీ ప్రతినిధులపై ఉందన్నారు. పునాదుల నుంచి రాష్ట్రంలో నవ నిర్మాణం జరగాలంటే మహా సంకల్పం ఉండాలని, అందుకే ప్రతిఏటా వీటిని చేపడుతున్నామని పేర్కొన్నారు. విశాఖ మహానాడు విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నవ నిర్మాణ దీక్షలు, మహా సంకల్పంలో కూడా అదే స్ఫూర్తితో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘కసిగా నవ నిర్మాణ దీక్షల్లో పాల్గొనండి. పట్టుదలగా మహా సంకల్పం చేయండి. కసి, పట్టుదల పెంచేందుకే ప్రతి ఏటా దీక్షలు, సంకల్పాలు జరుపుతున్నాం’ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రతి నియోజకవర్గానికి ఒక సంకల్పం చేయాలని, జిల్లాలో సంకల్పం జరగాలని, రాష్టస్థ్రాయిలో మహా సంకల్పం చేయాలని సూచించారు. దీక్షల్లో నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంపై ప్రతిరోజూ పార్టీ ఎప్పటికప్పుడు విశే్లషిస్తుందన్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారందరికీ పదవులు ఇస్తున్న విషయం గుర్తుచేశారు. నూటికి 80 శాతం ప్రజల్లో సంతృప్తి రావాలని, రాజకీయ ఏకీకరణ 80 శాతం జరగాలని ఆకాంక్షించారు. అంతిమంగా ప్రజలంతా మనవైపే ఉండాలని, అందుకోసం నాయకులు, కార్యకర్తలు నిరంతరం ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్‌చార్జి మంత్రిని నియమించిన విషయం గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలను, కార్యకర్తలను పార్టీ నాయకులే సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీ ద్వారా సమాజ సేవ చేసే అవకాశం మనకు వచ్చిందని, ఈ రాష్ట్రాన్ని బాగుచేసే అవకాశం ప్రజలు మెచ్చి ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకు ఆంధ్రప్రదేశ్‌కు తోడ్పడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పంట కుంటల తవ్వకంలో రైతులను పార్టీ నాయకులు, కార్యకర్తలు వెన్నంటి ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో, వార్డుల్లో వౌలిక సదుపాయాల అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఉద్యమ స్ఫూర్తితో నవ నిర్మాణం చేస్తున్నామని, గత మూడేళ్లలో ఊహించని విధంగా సంక్షేమం చేపట్టామని, ఊహించని విధంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. తలసరి ఆదాయం తక్కువగా ఉండటానికి కారణం కాంగ్రెస్సేనంటూ, మూడేళ్లయినా ఆ పార్టీపట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.