తెలంగాణ

పదవుల పందేరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రంలో 29 జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లతోపాటు, రెండేసి జిల్లాలకు ఒకరిచొప్పున 16మంది మహిళా ఆర్గనైజర్లను సిఎం కె చంద్రశేఖర్‌రావు సోమవారం నియమించారు. వీరికి నెలకు రూ.51 వేల గౌరవ వేతనంతోపాటు రూ.25 వేల ప్రయాణ భత్యంగా చెల్లించనున్నట్టు ప్రకటించారు. గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, మహిళా ఆర్గనైజర్ల పదవీకాలం రెండేళ్లపాటు ఉంటుంది. గ్రంథాలయ సంస్థల చైర్మన్లలో నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాలకు త్వరలో ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాకే ఒక మహిళా ఆర్గనైజర్ ఉంటారని పేర్కొన్నారు. చైర్మన్లుగా నియమితులైన వారిలో భూపాలపల్లికి ఎన్ రాజేశ్ నాయక్, వరంగల్ రూరల్‌కు బొచ్చు విజయ, మహబూబాబాద్‌కు జి నవీన్‌రావు, వరంగల్ అర్బన్‌కు ఎండి అజీజ్ ఖాన్ నియమితులయ్యారు. జనగామకు ఎడవల్లి కృష్ణారెడ్డి, పెద్దపల్లికి జి రఘువీర్, కరీంనగర్‌కు ఏనుగు రవీందర్‌రెడ్డి సిరిసిల్లకు ఆకునూరి శంకరయ్య, జగిత్యాలకు కఠారి చంద్రశేఖర్‌రావు, సిద్దిపేటకు లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌కు డి చంద్రాగౌడ్, సంగారెడ్డికి పి నరహరిరెడ్డి, సూర్యాపేటకు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నల్లగొండకు రేకల భద్రాద్రి నియమితులయ్యారు. భువనగిరికి డాక్టర్ అమరేందర్ గౌడ్, గద్వాలకు బిఎస్ కేశవ్, వనపర్తికి వి లక్ష్మయ్య, మహబూబ్‌నగర్‌కు బి రాజేశ్వర్‌గౌడ్, ఆదిలాబాద్‌కు రౌతు మనోహర్, ఆసిఫాబాద్‌కు కనక యాదవరావు, మంచిర్యాలకు ఆర్ ప్రవీణ్‌కుమార్, నిర్మల్‌కు ఎర్రబోతు రాజేందర్, వికారాబాద్ ఎస్ కొండల్‌రెడ్డి, మేడ్చల్‌కు బి భాస్కర్ యాదవ్, రంగారెడ్డికి కప్పాటి పాండురంగారెడ్డి, కామారెడ్డికి కె సంపత్‌గౌడ్, ఖమ్మంకు ఎండి హజీజుల్‌హక్, కొత్తగూడెంకు దిండిగాల రాజేందర్, హైదరాబాద్‌కు కె ప్రసన్న నియమితులయ్యారు.
మహిళా ఆర్గనైజర్లుగా సంగారెడ్డి, మెదక్‌కు డి లక్ష్మి, సిద్దిపేట, జనగామకు బూర విజయ, గద్వాల, వనపర్తికి పి లలితా ముదిరాజ్, నల్లగొండ, సూర్యాపేటకు ఎం శరణ్యారెడ్డి, యాదాద్రి, మేడ్చల్‌కు ఎం సువర్ణారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌కు జి రాజ్యలక్ష్మి, నిజామాబాద్, కామారెడ్డికి బి నవనీత, వరంగల్ అర్బన్‌కు కమరున్నీసా బేగం, మహబూబాబాద్, భూపాలపల్లికి భారతిరెడ్డి, వికారాబాద్, రంగారెడ్డికి ఎ వీరమణి, ఖమ్మం, కొత్తగూడెంకు టి నాగమణి, కరీంనగర్, సిరిసిల్లకు జి రేణు, పెద్దపల్లి, జగిత్యాలకు మూల విజయారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌కు ఎ సరోజ, ఆదిలాబాద్, నిర్మల్‌కు కె శ్యామల, హైదరాబాద్‌కు ఎం సుశీలారెడ్డి నియమితులయ్యారు.