బిజినెస్

సరికొత్త స్థాయికి సెనె్సక్స్, నిఫ్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సరికొత్త రికార్డులను తాకాయి. చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న ప్రయత్నాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించడంతో మదుపరులు ఉత్సాహంతో ఉరకలెత్తారు. జిఎస్‌టిని ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న క్రమంలో మోదీ దాన్ని వచ్చే నెల 1 నుంచి తప్పక అమలుచేసే దిశగా వెళ్తుండటమే ఇందుకు కారణం. ఇక సోమవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 36.20 పాయింట్లు పెరిగి 31,309.49 వద్ద ముగియగా, నిఫ్టీ 21.60 పాయింట్లు అందుకుని 9,675.10 వద్ద నిలిచింది. ఈ స్థాయిలు సూచీలకు ఇదే ప్రథమం. దీంతో ఆల్‌టైమ్ హై రికార్డులు నమోదైనట్లైంది. ఇక ఒకానొక దశలో సెనె్సక్స్ 31,355.42 పాయింట్లు, నిఫ్టీ 9,687.20 వద్ద స్థిరపడ్డాయి. ఇవికూడా సరికొత్త రికార్డులే. ఆసియా మార్కెట్లలో చైనా, జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు లాభా ల్లో ముగియగా, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు నష్టాలపాలయ్యాయి.