బిజినెస్

స్వల్పంగా పెరిగిన జెఎల్‌ఆర్ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) రిటైల్ అమ్మకాలు గత నెల మేలో 1 శాతం పెరిగాయి. ఈసారి 45,487 యూనిట్ల విక్రయాలు జరిగాయని బుధవారం జెఎల్‌ఆర్ తెలియజేసింది. వీటిలో జాగ్వార్ బ్రాండ్ కార్ల అమ్మకాలు 28 శాతం వృద్ధితో 13,613 యూనిట్లుగా నమోదైతే, లాండ్ రోవర్ విక్రయాలు మాత్రం 7.1 శాతం దిగజారి 31,874 యూనిట్లకు పరిమితమయ్యాయి. బ్రిటన్, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా మార్కెట్లలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులే దీనికి కారణమని జెఎల్‌ఆర్ పేర్కొంది.