తెలంగాణ

ఇది స్కాంల ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం స్కాంల ప్రభుత్వంగా మారిందని, ఇంతవరకు బహిర్గతమై అన్ని కుంభకోణాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మియాపూర్ భూస్కాం రోజుకోమలుపుతిరుగుతోందని, కాని ప్రభుత్వం మాత్రం పెదవి విప్పడం లేదన్నారు. ఈ కేసును మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటుకునోటు కేసు, ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకేజి, నరుూమ్ ముఠా కేసులతో ప్రభుత్వం అవినీతిగా మారిందన్నారు. మియాపూర్ భూ మాఫియా కేసులో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాత్ర ఉందన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. 2019ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రైతులకు రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. వ్యవసాయరంగాన్ని ప్రభు త్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కావాలని కోరితే ఖమ్మంలో గిరిజన రైతులను పోలీసులు వేధించారన్నారు. పంటల బీమా పథకం వల్ల రైతుల కంటే కంపెనీలకు లాభం చేకూరిందన్నారు. స్వామి నాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్నారు.