తెలంగాణ

అంతర్జాతీయ స్థాయిలో మేడారం జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: గిరిజన సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపమైన మేడారం సమ్మక్క, సారక్క జాతరను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే జాతర ఏర్పాట్లను మంత్రి బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల గిరిజన, పర్యాటక శాఖ మంత్రులు, కార్యదర్శులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. పలు దేశాల్లో ఉన్న గిరిజన ప్రతినిధులను సైతం ఆహ్వానించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మేడారం నుంచి 50 కి.మీ దూరంలో జాతర ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి సమీక్షలో ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి క్రిస్టినా చోంగ్తూ, గిరిజన శాఖ కమిషనర్ లక్ష్మణ్, పర్యాటక శాఖ డైరక్టర్ సునితా భగవత్, సాంస్కృతిక శాఖ డైరక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.