Others

డాక్టర్ చక్రవర్తి (నాకు నచ్చిన చిత్రం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి ప్రధాన పాత్రలో వచ్చిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రం చాలా ఇష్టం. యద్దనపూడి సులోచనారాణి నవల ‘చక్రభ్రమణం’ ఈ చిత్రానికి ఆధారం. నిర్మాత డి మధుసూదనరావు, దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు. అక్కినేని విదేశాల్లో ఉన్నత చదువులు ముగించి స్వదేశం తిరిగిస్తొడు. అతని ప్రేయసి కృష్ణకుమారి. వృత్తి రీత్యా ఇద్దరూ వైద్యులు. అక్కినేనికి పినతల్లి కూతురు గీతాంజలి చెల్లెలు. చెల్లెలంటే అక్కినేనికి ప్రాణం. కాని గీతాంజలి కేన్సర్ వ్యాధితో మరణిస్తుంది. చెల్లెలి చివరి కోరిక మేరకు షావుకారు జానకిని వివాహం చేసుకొంటాడు అక్కినేని. అక్కినేనికి ప్రియమిత్రుడు జగ్గయ్య. వృత్తిరీత్యా ఇంజనీరు. జగ్గయ్య, సావిత్రిలది అన్యోన్య దాంపత్యం. అక్కినేనికి చెల్లెలు చనిపోయినది మొదలు అతను దిగులుపడి పరధ్యానంగా ఉంటాడు. ఏఎన్నార్ చెల్లెలు మాదిరిగానే, జగ్గయ్య భార్య సావిత్రికి కూడా సంగీతం, లలిత కళలు, రచయిత్రిగా ప్రవేశం ఉండటంవల్ల ఆమెను అక్కినేని తోబుట్టువుగా ఆరాధిస్తుంటాడు. అక్కినేని, సావిత్రిల సాన్నిహిత్యాన్ని అపార్థం చేసుకొని జానకి అక్కినేనితో గొడవలు పడుతుంది. జానకి ఇంట్లో పెద్దదిక్కుగా ఉండే సూర్యకాంతం, జానకిని ఒప్పించి సావిత్రికి అక్కినేనికి అక్రమ సంబంధం ఉందని జగ్గయ్యకు ఉత్తరాలు రాయిస్తుంది. అక్కినేని, సావిత్రిల బంధాన్ని అపార్ధం చేసికొని జగ్గయ్య రగిలిపోతాడు. సావిత్రిని అనుమానించి పుట్టింటికి పంపేస్తాడు. అక్కినేని, సావిత్రి, అన్నయ్య గుమ్మడి మిత్రులు. గుమ్మడి తన చెల్లెలు సంసారం చక్కదిద్దాలని శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. చివరకు అపార్ధాలు తొలగి వైరాగ్యంతో తిరిగి విదేశాలకు వెళ్ళడానికి తయారౌతాడు అక్కినేని. కాని ప్రాణాపాయ స్థితిలో తన చెల్లెలు సావిత్రికి ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదిస్తాడు. తిరిగి అందరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది. నటనరీత్యా అక్కినేనికి నూటికి నూరుమార్కులు. భార్యను అనుమానించే భర్తగా జగ్గయ్య నటన కొట్టిన పిండి. సంసారాల్లో కూలదోసే పాత్రలో సూర్యకాంతానికి తిరుగులేదు. సావిత్రి నటన ఈ చిత్రంలో అజరామరం. అక్కినేని, సావిత్రి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రోజుల్లో అన్నాచెల్లెలుగానూ మెప్పించారు. ఇక సాలూరు రాజేశ్వరరావు స్వరపర్చిన రత్నాల్లాంటి బాణీలు ఎప్పటికీ ప్రేక్షకులను సంగీత ప్రపంచంలో ఓలలాడిస్తాయి. ‘నీవులేక వీణ’, ‘మనసున మనసై’, ఈ వౌనం ఈ బిడియం’ పాటలు ఈనాటికీ నిత్యనూతనాలు. అధఃపాతాళానికి జారుతోన్న ప్రస్తుత సినీ సాహిత్యానికి ఆ పాటలు పెద్ద బాలశిక్షే. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రాలలో ‘డాక్టర్ చక్రవర్తి’ అగ్రస్థానంలో నిలుస్తుంది.

-పిఎస్‌ఆర్ కర్నూలు