Others

గుర్తింపొచ్చిందోచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబుతో ఒకే ఒక్క సినిమా నేనొక్కడినేలో నటించి, ఫేట్ సరిగా లేక కనపడకుండా పోయింది కృతిసనన్. అయితేనేం బాలీవుడ్ చేరి, టైగర్‌ష్రాఫ్ హీరోగా వచ్చిన హీరోపంతి సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో అక్కడ ఓ గుర్తింపు వచ్చిన ఈ పొడుగుకాళ్ల సుందరికి. ఆమె గ్లామర్‌కు, నటనకు మంచి మార్కులే పడడంతో దిల్‌వాలేలో షారుఖ్‌ఖాన్‌తో నటించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపే వచ్చింది. ఇక తెలుగు వైపు చూడదేమో అన్నట్టుగా ఉంది అమ్మడి వ్యవహారం. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం రాబ్తా కూడా సంచలన విజయం సాధిస్తోంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. అందమైన చాక్‌లెట్ల తయారీదారుగా బిజినెస్ ఉమన్‌గా ఓ పాత్రలో నటించి, ద్విపాత్రాభినయంగా మరో పాత్రలో యుద్ధ వీరనారిగా యువరాణి పాత్రలో ఒదిగిపోయిందట. ఈ సినిమా చూశాక ఆమెకు అందరూ మంచి భవిష్యత్ ఉందని అభయం ఇస్తున్నారు. ఎలాగైతేనేం కృతికి మరో హిట్ దక్కింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా ఎదగాలన్న ఆమె ప్రయత్నాలకు ఈ చిత్రం ఉత్సాహాన్నిస్తోంది. చిత్రంలో కథానాయకుడుతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందట. మొత్తానికి కృతికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చినట్లే!