Others

..అలా పుట్టిన పాత్రలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా చాలావరకు నిజ జీవితానికి అద్దంలాంటిది. మనిషిలోని విభిన్న మనస్తత్వ కోణాల్ని సహజంగా చూపే మాధ్యమం. మనిషిలో పశుప్రవృత్తి, నేర మనస్తత్వం ఎలా జనిస్తుంది? ఎటువంటి పరిస్థితుల్లో మనిషి మారిపోతాడు? ఎటువంటి దశలు లేదా పరిస్థితులు మనిషిలో పశుప్రవృత్తిని మేల్కొల్పుతాయి? ఈ ధోరణులను కళ్లకు కట్టినట్టు చూపిన చిత్రాలు -దొరవారి సత్రం, మృగం, కీచక. దొరవారి సత్రంలో హీరో బాల్యంలో తల్లిని కోల్పోతే దొరవారి సత్రమే ఆదరిస్తుంది. అక్కడుండేది రౌడీలు, డబ్బుకోసం ప్రాణం తీసే గూండాలు. తనను పెంచారనే కృతజ్ఞతతో వారిలో ఒకడైపోతాడు హీరో. ఇదోరకమైన పాత్ర.
చిన్నప్పటినుండే పిల్లలు తమచుట్టూ ఉన్న పరిస్థితుల్ని అనుకరిస్తూ (లేదా) వాటి ప్రభావంలో ఉంటూ పెరుగుతారు. హీరో కూడా అలానే పెరిగి అక్కడి వ్యక్తుల మాదిరిగా తయారవుతాడు. ఈ సినిమాలో ఇంకో పాత్ర హీరోయిన్ బాబాయి. ఇతను డబ్బుకోసం సొంత అన్ననే దొరవారి సత్రం మనుషులతో చంపిస్తాడు. తన ఉనికి బయటపడకూడదని హీరో హీరోయిన్ల పెళ్లికి అడ్డుపడి కిరాతకంగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ ఇతని మనస్తత్వాన్ని పరిశీలిస్తే ఇతను సవతి తల్లి కొడుకు. అతని అభద్రతాభావం అతన్ని ఉన్నత చదువు, బాధ్యతగల పోలీస్ ఆఫీసర్‌ను చేసినప్పటికీ ఇలాంటి చర్యలకు ప్రేరేపించింది.
ఇటువంటి క్రూర మానసిక ప్రవృత్తిగలవారు మారే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఎలా మారొచ్చు? అన్నది కూడా సినిమాలో డైరెక్టర్ లాల్‌జోస్ స్పష్టంగానే చూపాడు. హీరో దగ్గరికి తనలాంటి అనాథ అయిన పసికందు చేరడంతో అతని మానసిక ప్రవృత్తిలో మార్పు వస్తుంది. ఆ పసికందులో ఒకప్పటి తననుతాను చూసుకుంటాడు. తన వేదన, బాధ ఆ బిడ్డ కూడా అనుభవించాల్సి వస్తుందేమోనన్న వ్యధ అతన్ని మారుస్తుంది. నిజ జీవితంలోనూ ఇలాంటి పాత్రలెన్నో. తమకన్నా ఎక్కువ జీవన స్థితిగతులున్న వ్యక్తుల్ని చూసి ఆత్మన్యూనతకు గురవుతూ, తక్కువ స్థితిగతులు కలవారిని చూసి జాలిపడే వారు తమలాంటి వ్యధలే అనుభవించిన వారిని చూస్తే మాత్రం స్పందిస్తారు. దీనికి కారణం వారిలో లీలగా తమని తాము చూసుకుంటారు.
ఇకపోతే అభద్రతాభావంతో జనించే క్రూర మనస్తత్వం మారడం చాలా కష్టమైన అంశం. కారణం ఏమిటంటే ఒకసారి అభద్రతాభావానికి అలవాటుపడినవారు, మొదట ఏ భావంవల్ల అది జనించినా తర్వాత మాత్రం ప్రతి విషయంలో అభద్రతకు గురవుతారు. తద్వారా దానిని తమ క్రూర ప్రవర్తన ద్వారా వ్యక్తీకరిస్తుంటారు. దీనికి ఉదాహరణే హీరోయిన్ బాబాయి. దానికి కారణం డబ్బు లేక మరేదైనా కావచ్చు. చివరికి అతను చంపబడ్డట్టుగా చిత్రీకరించారు సినిమాలో కానీ మారినట్టు చూపలేదు. అభద్రతాభావం మూలంగా ఏర్పడిన క్రూర ప్రవృత్తి అంత భయంకరమైనది కావచ్చు.
ఇక మృగం సినిమాకు వస్తే ఇందులో హీరో కేవలం లైంగిక ప్రవృత్తిరీత్యా క్రూరుడు. (మృగం సినిమా ఈమధ్యే వచ్చింది. స్వామి దర్శకత్వంలో ఆది పినిశెట్టి, పద్మప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం). ఇతని బాల్యాన్ని పరిశీలిస్తే తల్లి వేశ్య. ఆమె మరణించిన తర్వాత బాల్యంలో ఓ దంపతులు ఇతన్ని పెంచుకుంటారు. ఇతనితోపాటు ఓ ఆంబోతు ఉంటుంది. ఇతని వృత్తి కేవలం ఆ ఆంబోతుతో ఆవులు సూడికి వచ్చేలా చేయడం. పశువులో ఉండే పశుప్రవృత్తి కూడా కొన్నిసార్లు మనిషిపై ప్రభావం చూపుతుందని అనడానికి ఇతని పాత్రే ఉదాహరణ. ఆ ప్రవృత్తితోనే నచ్చిన ఆడదాన్ని వదలకుండా బలవంతంగా అనుభవిస్తుంటాడు. పెళ్లైన తర్వాత అతనికి జైలుశిక్ష పడుతుంది. అక్కడ చెడు స్నేహాలు, చెడు అలవాట్లు అలవర్చుకుంటాడు. ఊళ్లోవాళ్ల చెప్పుడు మాటలు విని భార్యను అనుమానించి గర్భవతి అయిన ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇలా సాగుతున్న అతనికి చివరికి ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ వచ్చినా అతని రూపం కృశించేవరకు అతని ప్రవృత్తిలో మార్పురాదు. చివరికి మారతాడు. ఎయిడ్స్ సోకిన కారణంగా కుటుంబంతో సహా అతన్ని ఊరినుంచి వెలివేస్తారు. మృగంలా ప్రవర్తించినప్పుడు ఏం చెయ్యడానికీ సాహసించనివాళ్ళు అతను పూర్తిగా రోగిష్టి అయిన తర్వాత చంపేస్తారు. ఇక్కడ కథానాయకుని మనస్తత్వాన్ని పరిశీలిస్తే అతనిలో ఒక్కసారి జనించిన క్రూర లైంగిక ప్రవృత్తి చివరివరకూ మారనే లేదు. చివరిలో వచ్చిన మార్పును కూడా పరిశీలిస్తే అది అతనికి సామర్థ్యంలేక దాని పరిణామంగా వచ్చిన మార్పేగానీ నిజమైన మార్పుకాదని అర్థవౌతుంది. అంటే లైంగికపరమైన విశృంఖలత ఉంటే ఆ ధోరణిలో మార్పురావడం కష్టమైన అంశం.
ఇక ‘కీచక’ సినిమాకు వస్తే ఇందులోని కీచకుడిది కూడా విపరీతమైన లైంగిక ప్రవృత్తి. ఆడదాని బాధే ఇతనికి రతిలో సుఖాన్నివ్వడం విభిన్న లైంగిక పైశాచిక కోణంగా చెప్పాలి. దీనికి ఉదాహరణ భార్యతో అతని అనుభవం. అతని భార్య శోభనంనాడు ఎంతో ప్రేమతో అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. అతనికి ఆ వైఖరి నచ్చదు. వెంటనే ఆమెను వదిలించుకొని బయటకు వచ్చేస్తాడు. అతని వైఖరి ఏమిటో భార్యకు అర్ధంకాదు. అప్పుడు అదే దారిగుండా వెళ్తున్న ఓ కుటుంబంలోని చిన్న పిల్లను దారుణంగా అతను రేప్ చేస్తాడు. అది చూసి వణికిపోతుంది భార్య. అప్పుడు ఆమె వద్దంటూ పెనుగులాడుతుంటే ఆమెను అనుభవిస్తాడు.
ఓ మనిషి మానసికంగా మిగిలిన ఏ ప్రవృత్తుల ద్వారా క్రూరుడైనా మారే అవకాశం పరిస్థితులు, అనుభవాలుబట్టి ఉండొచ్చు. కానీ లైంగికపరమైన పైశాచిక ధోరణి మాత్రం మారడం కష్టం.
‘కామశక్తి’ అనేది సృజనాత్మకతకి సంకేతమని చాలామంది భావిస్తారు. ఆ శక్తి వినియోగంలో సంభవించే అపశృతులు మనిషి పూర్తి రూపురేఖల్నే వ్యక్తిత్వపరంగా మార్చేస్తాయి. అనేక మానసిక రుగ్మతలకి గురిచేస్తాయి. ఆ రుగ్మతలే వారిలోని పైశాచిక ధోరణిని మేల్కొల్పుతాయి. పరిస్థితుల రీత్యా వచ్చే మానసిక ప్రవృత్తిలోని లోపాలు చాలావరకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తే నయమవ్వడానికి అవకాశం ఉంది. కానీ లైంగిక పైశాచిక ప్రవృత్తి పరిస్థితులతో వచ్చేది కాదు. ఏదో ఒక పరిస్థితికి పరిష్కారంగా వెతుక్కొనే మూలమే ఈ ధోరణి. అదే పరిష్కారమని మనసు నమ్మినంతకాలం ఆ రుగ్మత తగ్గే ప్రసక్తే ఉండదు.

-శృంగవరపు