శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లాలో ఎస్సైల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 12: జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మకూరు-2లో పనిచేస్తున్న షేక్ అబ్దుల్జ్రాక్‌ను మర్రిపాడు, వి ఆర్‌లో ఉన్న షేక్ ఖాజిబాబును ఆత్మకూరు-1, 5వ పట్టణ ఎస్సై నాగభూషణంను బిట్రగుంట, విఆర్‌లో ఉన్న టివి రమణను పెళ్లకూరు, పెళ్లకూరులో ఉన్న కె రవినాయక్ నాయుడుపేట, విఆర్‌లో ఉన్న ఎన్ మధుసూదన్‌రెడ్డి మహిళా పోలీస్‌స్టేషన్, విఆర్‌లో ఉన్న ఎస్ వెంకటేశ్వరరాజు కావలి-1కు, విఆర్‌లో ఉన్న కె వేణుగోపాల్‌ను చిట్టమూరు, చిట్టమూరులో ఉన్న బి గోపాల్‌ను దక్షిణ ట్రాఫిక్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దక్షిణ ట్రాఫిక్‌లో ఉన్న పి వీరనారాయణ, సిహెచ్ బలరామయ్య, ఉత్తర ట్రాఫిక్‌లో ఉన్న సిహెచ్ కొండయ్యలను విఆర్‌కు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న కె సుధాకర్‌ను కోట, అక్కడ పనిచేస్తున్న జి అజయ్‌కుమార్‌ను దక్షిణ ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న ఎం గంగాధర్‌ను ఎస్బీ, టి శేఖరయ్య, కె శ్రీనివాసులు, కె శ్రీరామకృష్ణలను సిసిఎస్‌కు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న ఏ జగత్‌సింగ్‌ను పొదలకూరు, వెంకటాచలం ఎస్సై డి వెంకటేశ్వరరావును విఆర్‌కు బదిలీ చేశారు. సిసిఎస్ ఎస్సై కె చెంగయ్యను శ్రీహరికోట, అక్కడ ఉన్న డిఎస్ విజయకుమార్‌ను ఓజిలి స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.