మెయిన్ ఫీచర్

మనసులు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అల్ట్రామోడ్రన్’ అని చెప్పుకునే ఈ మాయదారి కాలంలో మనిషికి ఏమయిందో ఏమో గానీ చాలా స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడు. తన గురించి తను తప్ప, తనవారి గురించి, సాటి మనిషి గురించీ ఆలోచించటంలేదు. విలాస వస్తువులమీద, ఎలక్ట్రానిక్ గాడ్జెస్‌మీద చూపించే ప్రేమ మనుషులమీద చూపించటంలేదు. ఏ పని చేసినా ఏదో హడావుడీ, ఆర్భాటం, తెచ్చిపెట్టుకున్న ఆప్యాయతలు, కుహనా ప్రేమలే తప్ప స్వభావ సిద్ధమైన మంచితనం, అనుభూతి ప్రధానమైన ప్రేమ, అభివృద్ధిని గురించిన ఆశయం, పట్టుదల, అంకితభావం మృగ్యం. అలాంటివాళ్ళు ఈ లోకంలో ఒక్కరయినా దొరుకుతారేమోనని కాగడా వేసి వెతకాల్సిన పరిస్థితులు ఇపుడు సమాజంలో నెలకొని ఉన్నాయి.
జీవితపు ఆఖరి దశలో వృద్ధాప్యపు బాధలను అనుభవిస్తున్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోవడం లేదన్నది.. వాళ్ళ బాధ్యతలను చేపట్టడం లేదన్నది నడుస్తున్న సమాజం చెబుతున్న కఠోర వాస్తవం.
ఒకవేళ కొంతమంది ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నా- అది లోకం ఏమనుకుంటుందోనన్న భయం, నలుగురూ విమర్శిస్తారేమోనన్న సంకోచంతో బలవంతంగా నిర్వర్తిస్తున్నదేగానీ ప్రేమ గౌరవాలతో మాత్రం కాదన్నది మరో కఠోర సత్యం. ఇలా అని మొహంమీద అడిగితే ఒప్పుకోవడానికి ముందుకు రారుగానీ అది వాళ్ళ మనస్సాక్షికి మాత్రం లోలోపల తెలిసే ఉంటుంది. తల్లిదండ్రులు చనిపోయాక చేస్తున్న అపరకర్మల సంగతీ అంతే- అవి తప్పని తద్దినాలే గానీ.. పోయినవాళ్ళకు పుణ్యలోకాలు ప్రాప్తించాలన్న కోరికతో చేస్తున్నవి మాత్రం కాదు. ‘ఏదో అయింద’నిపిస్తే నలుగురూ తనను ‘సుపుత్రుడు’ అని మెచ్చుకుంటారన్న ఆశ, ఎదురుచూపు.. అంతే!
ఒక్క తల్లిదండ్రులు, పిల్లల అనుబంధం విషయంలోనే కాదు.. అన్ని ‘జన్మబంధాలు’, ‘రక్తసంబంధాలు’, ‘వివాహ బంధా లు’ ఇపుడు అలాగే తప్పని బంధాలు, చేయక తప్పని సంసారం, లేనిపోని చుట్టరికాలు అన్న పద్ధతిలో బలవంతంగా కొనసాగుతున్నవేమోగానీ.. ప్రేమానురాగాలు పునాదిగా ఏర్పడినవి కావు. ఒకసారి ఇల్లు, వాకిలి, కుటుంబం, దేశం వదిలిపెట్టిపోయినవాడు.. అదే పోకగా పోయి ఏళ్ళ తరబడీ అక్కడే ఉండిపోతుంటే సమిష్టి జీవనంలోని దగ్గరితనం వానికి ఎలా తెలుస్తుం ది? గుండెల్లో అంతకుముందున్న ఆ కాస్త తడీ ఎండిపోయి... బీటలు వారిపోయి... ఇక్కడ ఉన్న వూళ్ళో ‘తల్లో, తండ్రో చనిపోయార’ న్నా.. కనీసం కళ్ళు చెమరించటం కూడా లేదు. ‘ఎనే్నళ్ళయిందో నాన్నను చూసి.. అమ్మ వాత్సల్యపు స్పర్శ ను అనుభవించి’ అన్నది ఇప్పుడు ఆలోచనకు కూడా రావటంలేదు. ఇక ఏడు పు రావాలంటే ఎలా వస్తుం ది? రాదు..! ఎందుకంటే- అతని గుండె స్పం దించడం మానేసి చాలాకాలమయింది. అనుభూతి అంటే ఎలా ఉంటుందో అర్థంకాక, అనుభవానికి రాక అదేదో పుస్తకాల్లో వాడే భాషాపదం నుకుంటున్నాడు. మానవ సంబంధాల సంగతులే ఇలా ఏడిస్తే.. ఇక తను పుట్టి పెరిగిన ఊరు గురించీ, తల్లిలాంటి తన మాతృదేశం గురించీ నాలుగు మాటలు చెప్పమంటే ఏం చెబుతాడు? నీళ్ళు నములుతాడు..! బుర్ర గోక్కుంటాడు.. తన ప్రేమరాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ‘డర్టీ విలేజ్.. ఇండియన్ మెంటాలిటీ’ అంటూ కారుకూతలు కూస్తాడు. ఆ విధంగా తన భావదారిద్య్రాన్ని బయటపెట్టుకుంటాడు.
విదేశాల్లో ఉన్నవాళ్ల మాట పక్కనపెడితే స్వదేశంలో ఉన్నవాడు మాత్రం ఏం ఉద్ధరిస్తున్నాడని? ‘అందరూ అమెరికా వెళ్లి బావుకుంటున్నారు- నేను బావుకోవటం లేద’ని, మనిషి ఇక్కడ.. మనసు అక్కడ అన్నట్టు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు. దీనికంతటికీ కారణం మనుషుల్లో చిత్తశుద్ధి లోపించడం.. చేసే ఏ ఒక్క పనీ మనసుతో, ప్రేమతో కాక ఏదో మొక్కుబడిగానో, ఫార్మాలిటీగానో చేయడం..! ఈ పద్ధతి మారాలంటే ముందు మనిషి మనసు మారాలి! అందుకు ఆత్మపరిశీలన తప్పనిసరి!

- డా కొఠారి వాణీచలపతిరావు