తెలంగాణ

హరితహారం విజయవంతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులంతా సహకారం అందించాలని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాద్ (రాజేంద్రనగర్) లోని సిపార్డ్‌లో మంత్రి శనివారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సంవత్సరం వర్షాలు బాగా ఉంటాయని, అందుకు అనుగుణంగా మొక్కలను నాటాలని, అలాగే వాటిని సంరక్షించాలని సూచించారు. నర్సరీలు లేని గ్రామాల్లో వెంటనే విఎఓల ద్వారా నర్సరీలు ఏర్పాటు చేయించాలన్నారు. విలేజ్ ఆర్గనైజర్లు, సెర్ప్ ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మంత్రి కోరారు.
ఉపాధి హామీ పథకంలో కనీసం 60 శాతం మంది కూలీలకైనా పనికల్పించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ఎంపీడిఓలు, డిఆర్‌డిఓలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కల్వర్టులు, ఫాంపాండ్స్, ఇంకుడుగుంతలను పెద్దఎత్తున ఉపాధిహామీలో చేపట్టాలని సూచించారు. సామాజిక పింఛన్ల పంపిణీ సజావుగా సాగేలా చూడాలని, బ్యాంకులు, పోస్ట్ఫాసుల అధికారులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రతిగ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలన్నదే తమ (ప్రభుత్వ) ఉద్దేశమని మంత్రి తెలిపారు. నాబార్డు ఇస్తున్న నిధులను పూర్తిగా వినియోగించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమినర్ నీతూప్రసాద్, సెర్ప్ సిఇఓ పౌసమి బసు, స్ర్తినిధి ఎండి విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు