తెలంగాణ

జలాశయాలు వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 18: తెలుగు రాష్ట్రాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం డెడ్ స్టోరేజి 510అడుగులకు దిగువగా గత పదేళ్లలో లేని రీతిలో కనిష్ట స్థాయి 501.90అడుగులకు పడిపోవడం జలాశయం ఎదుర్కొంటున్న నీటి కటకటకు నిదర్శనంగా కనిపిస్తుంది. సాగర్ జలాశయంలో నీటి మట్టం అడుగంటుతుండటంతో ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా వాసులతో పాటు జంటనగరాలకు తాగునీటి కటకట పొంచి ఉంది. మల్లన్న సన్నిధిలోని శ్రీశైలం జలాశయ నుండి మరో దఫా నీటి విడుదలకు కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతిస్తేనే నాగార్జున సాగర్ జలాశయం పరిధిలో తాగునీటి అవసరాలు తీరనుండగా ఇందుకు బోర్డు నిర్ణయం కీలకంగా మారింది. ఇప్పటికే ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పుట్టంగండి వద్ద సాగర్ జలాశయం నుండి జంటనగరాలకు తాగునీరందించేందుకు అత్యవసర మోటార్లను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఏడు అత్యవసర మోటార్లను నడిపిస్తూ పుట్టంగండి ప్రధాన మోటార్ ఒక దానికి నీటిని అందిస్త్తూ 600క్యూసెక్కుల నీటి సరఫరా సాగిస్తున్నారు.
ఈ వారంలో మరో మోటార్ నడిపించి 900క్యూసెక్కుల నీటిని పంప్ చేసేందుకు పది అత్యవసర మోటార్లను నడిపించాలని నిర్ణయించారు. అత్యవసర మోటార్లు సమర్ధవంతంగా నడవాలంటే అందుకు సాగర్ జలాశయంలో కనీస నీటి మట్టం 502అడుగులకు తగ్గకుండా ఉండాలని ఇందుకోసం 1టిఎంసి నీటిని శ్రీశైలం నుండి విడుదల చేయాలంటూ జెన్‌కో కోరింది. ఏఎమ్మార్పీతో పాటు ఇతర అవసరాలకు కనీసంగా 4టిఎంసిలు కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డును కోరుతోంది. అటు వర్షాకాలం ఆరంభమై రుతుపవనాలు సైతం తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించినప్పటికీ కృష్ణానది, ఉపనదుల ఎగువ ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు పడితేనే శ్రీశైలం నుండి నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్‌లకు వరద తాకిడికి అవకాశముంది. అప్పటిదాకా శ్రీశైలం నుండి చేసే నీటి విడుదలపైన ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి ఉండగా శ్రీశైలం జలాశయంలో సైతం 778అడుగులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు ఎంత మేరకు సాగర్‌కు నీటి విడుదలకు అనుమతిస్తుందన్నదీ ఆసక్తికరంగా మారింది.
పదేళ్లలో కనిష్ట స్థాయికి సాగర్ జలాలు !
నాగార్జున సాగర్ జలాశయంలో నీటి మట్టం ప్రస్తుత స్థాయి 501.90అడుగులుగా గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కనిష్టస్థాయకి చేరడం జలశయం ఎదుర్కోంటున్న నీటి కొరతకు అద్దం పడుతుంది. రాష్ట్ర విభజన పిదప అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు రెండు కూడా తమ ప్రాంత ప్రజలు, రైతుల అవసరాలకు పెద్దపీట వేస్తు కృష్ణాబోర్డు శ్రీశైలం జలాశయం నుండి నీటిని విడుదల చేసిన వెంటనే సాగర్ జలాశయం నుండి ఎవరి వాటా నీరు వారు విడుదల చేసుకుంటుండటంతో జలాశయంలో నీటి నిల్వ వృద్ధికి అవకాశం లేకుండా పోతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులు 408.24టిఎంసిలు. అయితే పూడిక కారణంగా నీటి నిల్వలో 312.45అడుగులకు పడిపోయింది. పడిపోయిన నీటి నిల్వ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే గతంలో కంటేకూడా సాగర్ జలాశయంలో నీటి నిల్వ మరింత లోతుకు పడిపోయినట్లుగా చెప్పవచ్చు. అందుబాటులో ఉన్న లెక్కల మేరకు అత్యంత కనిష్ట స్థాయిలో 2004లో 495.10అడుగులకు, 2003లో 496.90అడుగులకు సాగర్ నీటి మట్టం పడిపోయింది. తదుపరి మళ్లీ ఈ ఏడాది మాత్రమే గత పదేళ్లలో లేని రీతిలో సాగర్ నీటి మట్టం 501.90అడుగులకు పడిపోయింది.
2000సంవత్సరంలో జూన్ మాసం ఇదే సమయానికి 523.0అడుగులు, 2001లో 504.10, 2002లో 506.50, 2003లో 496.90, 2004లో 495.10, 2005లో 503.50, 2006లో 546.20, 2007లో 523.20, 2008లో 544.40, 2009లో 504.80, 2010లో 521.30, 2011లో 554.80, 2012లో 511, 2013లో 520.20, 2014లో 517.90, 2015లో 514.10, 2016లో 506.20, 2017లో జూన్‌లో 501.90అడుగుల నీటి మట్టం ఉంది. పడిపోయిన సాగర్ జలాశయం మళ్లీ జలకళ సంతరించుకోవాలంటే సమృద్ధిగా వర్షాలు పడి ఎగువ ప్రాంతం నుండి కృష్ణమ్మ పరవళ్లు తొక్కడం, శ్రీశైలం జలాశయం నుండి అందుబాటులో ఉన్న నీటిని విడుదల చేయడమే శరణ్యంగా కనిపిస్తుంది.

చిత్రం.. గత పదేళ్ల కనిష్ట స్థాయి 501.90అడుగులకు పడిపోయిన నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం