తెలంగాణ

23న హైదరాబాద్‌కు రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: ఈ నెల 23న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌కు రానున్నారు. శిల్పకళా వేదికలో ఎన్‌ఆర్‌ఐ సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్ట్రాటెజిక్ అలయెన్స్ (జిఎస్‌ఎ) వరల్డ్ డివైన్ కాంగ్రెస్‌ను రాష్టప్రతి ప్రారంభిస్తారు. ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రాష్టప్రతి చేరుకుంటారు. అక్కడి నుంచి 12-30 గంటలకు శిల్పకళా వేదికకు చేరుకుని 1.30 గంటల వరకు సదస్సులో పాల్గొని ఆ తర్వాత బేగంపేటకు తిరిగి చేరుకుని ఢిల్లీ వెళతారు. రాష్టప్రతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్టప్రతి పర్యటకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ల మరమ్మత్తులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్టప్రతి నగరం వీధులగుండా వెళ్లే మార్గంలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆయన ఆదేశించారు. రాష్టప్రతి పర్యటన సందర్భంగా తమ శాఖల పరంగా తీసుకుంటున్న చర్యలను సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఆదర్ సిన్హా, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్వీందర్ సింగ్, పోలీస్ ఉన్నతాధికారులు కృష్ణప్రసాద్, షానవాజ్ ఖాసీం, ఆర్ అండ్ బి ఇఎన్‌సి గణపతిరెడ్డి తదితరులు వివరించారు.