తెలంగాణ

మానసిక ప్రశాంతతకు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: యోగ శారీర దారుఢ్యంతోపాటు మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని తెలంగాణ డిజిపి కె అనురాగ్‌శర్మ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆక్టోపస్ క్యాంప్ మూడో బెటాలియన్‌లో టిఎస్‌ఎస్‌పి ఐజిపి అభిలాషా బిస్త్, ఆక్టోపస్ ఐజిపి కె శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యోగ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి డిజిపి ఆనురాగ్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నియమంగా యోగ అభ్యసించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం ఆయన కొత్తగా నిర్మించతలపెట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్, బ్యారెక్స్‌కు భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా మూడోపటాలం పరిసరాల్లో హరిత హారం కార్యక్రమంలో భాగంగా డిజిపి అనురాగ్ శర్మ మొక్కలు నాటారు.
సికిందరాబాద్ రైల్వే డివిజన్‌లో
సికిందరాబాద్ రైల్వే డివిజన్‌లో యోగ వేడుకను నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, అదనపు మేనేజర్ జాన్ థామస్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఎన్‌వి రమణరెడ్డి, రైల్వే సిబ్బంది తదితరులు యోగలో పాల్గొన్నారు.