సబ్ ఫీచర్

జయహో జయశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రసాయన శాస్త్రం అంటే చాలామందికి భయం. కానీ ఆమెకు ప్రాణం. ఆ ఇష్టమే ఆమెకు అరుదైన ఘనతను సాధించిపెట్టింది. సహజంగా సైన్స్ అంటే ఆమెకు మక్కువ. అందులనూ రసాయన శాస్త్రంలో వివిధ విభాగాలపైనా ఆసక్తి జాస్తి. ఆ రంగంలో ముప్పయేళ్లుగా ఆమె పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆమె మార్గదర్శకంలో ఎంతోమంది విద్యార్థులను పరిశోధకులుగా తీర్చిదిద్దారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 165 పరిశోధనా వ్యాసాలు చోటుచేసుకున్నాయి. జెఎన్‌టియు ప్రొఫెసర్ జయశ్రీ సాధించిన ఘనతలివి. పరిశోధనలపై మమకారం.. దానికి తగ్గట్లు పడిన శ్రమ ఫలితమే ఆమెను కెమిస్ట్రీ మేధావిగా తీర్చిదిద్దింది. ఆమె చూపిన ప్రతిభకు గుర్తుగా నేడు లండన్‌కు చెందిన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అవార్డు దక్కించుకున్న తొలి జెఎన్‌టియు మహిళా అధ్యాపకురాలిగా నిలిచింది. సైన్స్ పరిశోధనా రంగంలో జయశ్రీ కృషి మరెందరికో స్ఫూర్తిదాయకం.
తండ్రి ప్రేరణతోనే..
తండ్రి అందించిన ప్రోత్సాహంతోనే జయశ్రీ పరిశోధనల బాటపట్టారు. ఆయన సలహాతోనే ఆమె ఈ టీచింగ్ రంగంలోకి వచ్చారు. పోస్టుగ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతుండగానే వివాహం చేశారు. అయితే ఈ పెళ్లి ఆమె ప్రతిభకు అడ్డంకిగా మారలేదు. పర్సనల్, ప్రొఫెషనల్ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సైన్స్ పరిశోధనా రంగంలో తన సత్తా చాటారు. సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సహజ ఉత్పత్తులు, మాలిక్యూల్ మోడలింగ్, డ్రగ్ డిజైన్, గ్రీన్ కెమిస్ట్రీ, రసాయన జీవశాస్త్రంలో ఆమె పరిశోధనలు చేశారు.
యువత పరిశోధనారంగంలోకి రావాలి
నేడు ఎక్కువ మంది విద్యార్థులు ప్రొఫెనల్ కోర్సుల్లోకి వెళ్లటం బాధాకరంగా ఉందంటారు. ఇంటర్ అయిపోగానే ఇంజనీర్ లేదా మెడిసిన్ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. పరిశోధనా రంగంలోకి రావటానికి సుముఖుత వ్యక్తం చేయటల్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూంటారు. యూనవర్శిటీలు ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని, వర్శిటీల్లో చేరిన విద్యార్థులను సైన్స్, టెక్నాలజీలో పరిశోధనలకు పురిగొల్పేవిధంగా వారిలో ఉత్సాహాన్ని, ఆలోచనలు రేకెత్తించాల్సిన అవసరం ఉందంటారు. అలాగే టెక్నాలజీ, వౌలిక సదుపాయాల కల్పన విషయంలో సరికొత్త ఆవిష్కరణలకు విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఎమ్మెస్సీలో ఫెలోషిప్ ఇచ్చి ప్రోత్సహించాలని, ఎం.టెక్ చేసినవారిని పరిశోధనలోకి తీసుకువస్తే మంచిందని ఆమె అభిప్రాయపడతారు. అలాగే పరిశ్రమల ఆభివృద్ధికి ఉద్యోగ ఆధారిత కోర్సులు కూడా అవసరం ఉందని ఆమె ఆభిప్రాయం.
బాధ్యత పెంచింది..
‘సైన్స్ పరిశోధనల్లో తాను చేసిన కృషి చాలా తక్కువ అని భావించేదాన్ని. కాని ఈ అవార్డు మరింత బాధ్యత పెంచింది’ అని ఆమె అంటారు. సైన్స్, టెక్మాలజీ రంగాల్లో తాను చేస్తున్న కృషికి గుర్తింపు లభించినట్లయిందంటారు. సైన్స్‌లో పరిశోధనలవైపు విద్యార్థులను మరింత మందిని ఆకర్షించేందుకు ఈ అవార్డు ఉత్తేజాన్ని ఇస్తుందంటారు.