మహబూబ్‌నగర్

త్వరితగతిన ఎకో పార్కు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జూన్ 22: పట్టణ సమీపంలో చేపట్టిన ఏకో లంగ్ పార్కు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శే్వతామహంతి ఆదేశించారు. గురువారం కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఏకో పార్కును సందర్శించి పనులను పరిశీలించారు. అంచనాల్లో పేర్కొన్న డిజేన్ల ప్రకారమే పనులు చేపట్టాలని, పార్కులో గ్రీనరి ఉట్టిపడేలా ఉండాలని అన్నారు. సివిల్ పనులు ఇంకా పూర్తి కాలేదని, అలాగే పూలమొక్కల గార్డెనింగ్ తదితర అన్ని విషయాలలో పనులు నత్తనడకన సాగుతుండడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. జూలై మొదటి వారంలో హరితహారం సందర్భంగా పార్కు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని డిఎఫ్‌ఓ ప్రకాష్‌ను ఆదేశించారు. పార్కులో గడ్డి పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని, పార్కులో ఉన్న నర్సరీకి బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ శృతి వనాన్ని సందర్శించారు. అలాగే తిర్మలాయగుట్టను సందర్శించి మెయిన్ రోడ్డు నుండి తిర్మలాయగుట్ట వరకు ఉన్న రోడ్డుపై రెవిన్యూ ప్లాంటేషన్, రిజర్వు ఫారెస్టులో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఉపాధి హామి పనుల కింద గుంతలు తవ్వె పనులు చేపట్టాలని డిఆర్‌డిఓ గణేష్‌ను ఆదేశించారు. అటవి శాఖ ద్వారా తిర్మలాయగుట్ట ప్రాంతంలో మొక్కలు నాటడంలో చొరువ చూపాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు తిర్మలాయగుట్టపైకి వెళ్లి దారిలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం వద్ద రావి, వేప మొక్కలను నాటారు. అంతేకాక ట్రిగార్డును ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, ముఖ్యమైన ప్రాంతాలలో నాటిన మొక్కల రక్షణలో భాగంగా ట్రిగార్డులు ఏర్పాటు చేసేందుకుగాను ట్రిగార్డులు తెప్పించాలని అందుకు టెండర్లు పిలువాలని డిఆర్‌డిఓను కలెక్టర్ ఆదేశించారు.

బ్రిడ్జి పనులు 4రోజుల్లో పూర్తిచేయాలి
మక్తల్, జూన్ 22: మండల పరిధిలోని పంచదేవ్‌పాడ్ గ్రామ సమీపంలో ఉన్న 46వ ప్యాకేజి ప్రధాన కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆధేశించారు. గురువారం ఆయన బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనుల పురోగతి వేగవంతం లేని కారణంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదికి పైభాగంలోని కర్నాటక, మహారాష్ట ప్రజెక్టుల నుండి నీటి వరుద వస్తున్న కారణంగా భీమాలో అంతర్భాగమైన సంగంబండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపనున్నట్లు తెలిపారు. రూ.2కోట్ల, 49 లక్షలతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ఈపాటికే పూర్తి చేయవలసి ఉందని తెలిపారు. ఖరీప్ సీజన్ ప్రారంభమై 22 రెండు రోజులు గడుస్తున్న నేపథ్యంలో కృష్ణానదికి సైతం నీటి వరధ వచ్చే అవకాశం ఉందని, అంతలోపే బ్రిడ్జి పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. గత ఖరీఫ్‌లో కృష్ణానది వరద నీటితో తాక్కాలికంగా ఉన్న మట్టి బ్రిడ్జి నీటి వరధ ఉదృతికి కొట్టుక పోవడంతోటి ఈరహదారి గుండా మారుమూల గ్రామాలకు వెళ్లవలసిన ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తడంతోటి తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పర్మనెంట్ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంబడి టిఆర్‌ఎస్ నాయకులు మహిపాల్‌రెడ్డి, ఊట్కూర్ మాజీ జెడ్పిటిసి అరవింద్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.