కృష్ణ

భూసేకరణ పెండింగ్ కేసులకు తక్షణ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధికి భూసేకరణకు సంబంధించిన పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీకాంతం రెవిన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో రెవిన్యూ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, రైల్వే అధికారులతో పెండింగ్ భూ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ-్భమవరం, విజయవాడ-విశాఖపట్నం, గొల్లపూడి-బల్బు కాబిన్‌లకు సంబంధించిన భూసేకరణ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆర్‌డివోలకు కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. అదే విధంగా జాతీయ రహదారులకు సంబంధించి ఇబ్రహీంపట్నం, మైలవరం భూసమస్యలను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గందం చంద్రుడు, ఆర్‌డివోలు ఎస్.హరీష్, ఎం.చక్రపాణి, సిహెచ్ రంగయ్య పాల్గొన్నారు.
ఈ-సేవా కేంద్రాల్లో ధరల పట్టిక తప్పనిసరి
జిల్లాలోని 600 ఈ-సేవా కేంద్రాల్లో జారీచేసే ధ్రువీకరణ పత్రాలకు ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో రెవిన్యూ, మున్సిపల్, వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు తెరచిన నేపధ్యంలో విద్యార్థులకు వివిధ ధ్రువీకరణ పత్రాలను పొందవలసిన అవసరం ఉంటుందన్నారు. కనుక ఈ సేవా కేంద్రాల్లో ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల సేవలో రెవెన్యూ శాఖలో భాగంగా జారీచేయుచున్న ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీచేసే విధంగా చూడాలన్నారు. జూలై నెలలో మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సర్ట్ఫికెట్ కల్టివేషన్, జాయింట్ లైబిలిట్ గ్రూపులలోను ఎలిజిబులిట్ కార్డులు 1-5 ఫారంలో నమోదు కానివారికి ఎరువులు, విత్తనాలు, సూక్ష్మపోషకాలు, బ్యాంకు రుణాలు అందే విధంగా వ్యవసాయ అధికారులు పనిచేయాలన్నారు. ఖరీఫ్ సాగుకు నీటి సమస్య లేనందున ప్రతి హెక్టారు భూమిలో వరినాట్లు వేయించే విధంగా గ్రామస్థాయి అధికారులు పనిచేయాలన్నారు. చేసిన పొలం గట్లపై కంది విత్తనాలను చల్లే విధంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయంలో సేంద్రీయ ఎరువులు వినియోగించే విధంగా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు.