కృష్ణ

అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలకు అనుమతులివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జూన్ 22: అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలకు అనుమతులివ్వొద్దని గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామస్తులు గురువారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి మురాల రాజేష్ మాట్లాడుతూ గ్రామంలోని దళితవాడను ఆనుకుని 5ఎకరాల్లో రొయ్యల చెరువు తవ్వారని, మళ్ళీ 7.5 ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు అనుమతులివ్వడం దారుణమన్నారు. దీనివల్ల 500 కుటుంబాల వారు ఉపాధి కోల్పోతారని, మంచినీరు కలుషితం అవుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకం పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమిటీ సభ్యుడు బివి శ్రీనివాస్, గ్రామస్తులు ఎం వెంకటేశ్వరరావు, బి రమేష్, ఎస్ నాగార్జున, ఎం మధు, యు రామకృష్ణ, రంగబాబు, బి కోటేశ్వరమ్మ, ఎం కోటేశ్వరమ్మ, కె మేరిమ్మ, తదితరులు పాల్గొన్నారు.