విజయనగరం

యోగా భారతదేశ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, జూన్ 22: యోగా భారత దేశం యొక్క సంపద, ఇప్పుడిప్పుడే ప్రపంచంలోని అన్ని దేశాల్లో విస్తరిస్తోందని ఆశయ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి రమణ అన్నారు. అంతార్జాతీయ యోగా సందర్భంగా పాల్గొన్న విద్యార్ధులకు గురువారం స్థానిక కస్తూరిబా బాలికల విద్యాలయంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతోనే అన్ని రుగ్మతలనుంచి దూరం కావచ్చన్నారు. అందరూ యోగాతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్ధి దశనుంచే యోగా నిష్ణాత్నులు కావాలని ఆకాంక్షించారు. ఇదే విద్యాలయం నుంచి హాజరైన విద్యార్ధులు యోగాలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు విద్యాలయం ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మీ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నెహ్రూయువ కేంద్రం ప్రతినిధి మురళి తదితరులు పాల్గొన్నారు.