కరీంనగర్

ఏడాదిలోగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం జిల్లాలో జూలై మొదటివారంలో ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసి తీరుతామని, ఇందుకు జిల్లాలోని గుత్తేదారులు సహకరించి, పేద వారికి సొంతింటి కల సాకారం చేయటంలో తమవంతు కృషిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. జిల్లాకు మంజూరైన 6వేల డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంపై గుత్తేదారులు, భవన నిర్మాణ మేస్ర్తిలతో ఆర్‌అండ్‌బి అధికారులు గురువారం స్థానిక శే్వత హోటల్‌లో ఏర్పాటు చేసిన సమాలోచన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాల నేపథ్యంలో గుత్తేదారులు నిమగ్నమై ఉన్న నేపథ్యంలో రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి ముందుకు రాలేకపోతున్నారని అన్నారు. వర్షాకాలం సీజన్ ఆరంభం కావటంతో రహదారులు, ఇతరత్రా నిర్మాణాల్లో జాప్యం జరిగే అవకాశాలున్న దృష్ట్యా డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాలపై దృష్టి సారించాలని గుత్తేదారులకు సూచించారు. నిర్మాణాల్లో పలు రకాల మినహాయింపులు ఇస్తున్నట్లు, ఇసుకను ఉచితంగా అందజేయనుండగా, రూ.230కే సిమెంట్ బస్తా ఇప్పిస్తున్నట్లు, అలాగే, స్టీల్ కూడా తక్కువ ధరకే ఇప్పించేందుకు సంబంధిత కంపనీలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అయినా, ఇళ్ళ నిర్మాణానికి గుత్తేదారులు అయిష్టత వ్యక్తం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు నియోజకవర్గాల్లో మాత్రమే వేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైన ఇళ్ళ నిర్మాణం సామాజిక బాధ్యతగా భావించి గుత్తేదారులు ముందుకువచ్చి, తమకు వీలైనన్ని ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని, బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం ఎలాంటి జాప్యం ప్రదర్శించదని, ఆన్‌లైన్‌లో ఇళ్ళ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అప్పటికప్పుడే నిధులు విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. సమాలోచన సదస్సులో పాల్గొన్న అత్యధిక మంది గుత్తేదారులు ఇళ్ళ నిర్మాణంతో గిట్టుబాటు కష్టమేనని స్పష్టం చేయగా, నిర్మాణ రంగంలో ఉన్న అనుభవం దృష్ట్యా నష్టాలు రాకుండా, తక్కువ ఖర్చులో నాణ్యతతో కూడిన వేగవంతమైన ఇళ్ళు అందించటంపై సూచనలు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గుత్తేదారులు, నిర్మాణ మేస్ర్తిలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. లాభాపేక్ష వీడి సేవాభావంతో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో గుత్తేదారులు, భవన నిర్మాణ మేస్ర్తిలు భాగస్వాములు కావాలన్నారు. గుత్తేదారులు ముందుకు రానిపక్షంలో తామే ఆ బాధ్యత తీసుకుని నిర్మాణాలు పూర్తి చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగలు కమలాకర్ మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు ముందుకువచ్చే గుత్తేదారులకు లైసెన్స్‌లు కూడా ఇప్పించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, జిల్లాలోని ప్రతి గుత్తేదారు ఖచ్చితంగా రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణంలో భాగస్వాములై, ముఖ్యమంత్రి కలల పథకం పూర్తి చేసేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ సతీష్‌కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్‌తోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన గుత్తేదారులు, భవన నిర్మాణ రంగ మేస్ర్తిలు తదితరులు పాల్గొన్నారు.