కరీంనగర్

రాష్ట్రంలో రాచరిక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జూన్ 22: స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం దురదృష్టకరమని, నిధులు లేక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రజాప్రతినిధుల పాలన నిర్వీర్యమైందని మాజీ మంత్రి, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాచరికపాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులు కేటాయించడం లేదని, మూడేళ్లు గడిచినా ‘మన ఊరు - మన ప్రణాళిక’, గ్రామజ్యోతి కార్యక్రమాలు అటకెక్కాయన్నారు. పలు గ్రాంట్లు, సీనరేజ్ వంటి నిధులు మంజూరు లేక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి లేదని, ఇక రైతుల గోస వర్ణనాతీతమని, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎటిఎంలో డబ్బులు లేకుండా పాలన కొనసాగించడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, దీంతో అభివృద్ధి చేయలేక ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నారు. అలాగే మూడు సంవత్సరాలుగా మహిళా సంఘాలకు రావాల్సిన 1200 కోట్ల రూపాయల ఉచిత వడ్డీ రావడం లేదన్నారు. రైతాంగానికి విత్తనాలు లేవని, దీంతో పాటు రైతులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి జిల్లాల ఇంచార్జి మహేష్ గౌడ్, ఉమ్మడి జిల్లాల సర్పంచ్‌ల ఫోరం అద్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం రమేష్, బండ శంకర్, గణేష్ రెడ్డి, చేతి ధర్మయ్య, జడ్పీటిసి ఊట్ల రమ, మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత, ఎంపిటిసి ఒజ్జ సదయ్య, బొంగాని అనిల్‌గౌడ్, అమీనోద్దీన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.