కరీంనగర్

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న ఈత సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోనరావుపేట, జూన్ 23: కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో ఈత సరదా ముగ్గురు ప్రాణాలను బలిగొంది. సెలవు దినం కావడంతో ఈత కోసం వెళ్ళిన విద్యార్థులు అందులోనే మునిగి మృత్యువాత పడడం గ్రామాన్ని దుఖః సాగరంలో ముంచెత్తింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ముగ్గురు ప్రాణ స్నేహితులు కావడంతో మరణంలోనూ స్నేహం వీడలేదు. ఇందులో ఒక్కరికే ఈత రావడంతో అతడిని అనుసరించి ఇద్దరు స్నేహితులు సహా ముగ్గురు ఒకే సారి చెరువులో దూకడంతో చెరువు బుడుగులో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. మూడు కుటుంబాలకు పెద్ద కుమారులే కావడంతో సంఘటన స్థలం వద్ద గ్రామస్తులు, కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటాయి. పల్లిమక్తకు చెందిన ఎనగంటి సంజీవ్, కుడిక్యాల మనోహర్, కుడిక్యాల రాజులు మృతి చెందడంతో మండలంలో విషాదాన్ని నింపింది. మిషన్ కాకతీయ పనులు చేపట్టిన కుమ్మరి కుంటలో ఇటీవల కురిసిన వర్షాలకు మూడు గజాల లోతు నీరు చేరింది. నీటి మట్టం తెలియని చిన్నారులు అందులో దూకి ప్రాణాలు వదిలారు. అయితే చెరువులో దూకడానికి ముందు కట్టపై బట్టలు విడిచి దూకడాన్ని ఎవరూ చూడలేదు. అయితే మృతుడి తమ్ముడు బహిర్బూమికి వెళ్ళినపుడు చూడడంతో ఈ సంఘటన గ్రామస్తులకు తెలిసింది. కాపాడేలోపే మృత్యువాత పడి మరణించడం గ్రామస్తులను కలిచి వేసింది.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే రమేశ్‌బాబు
కోనరావుపేట మండలంలోని పల్లిమక్త గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మృతి చెందడంతో వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. శుక్రవారం ఆయన సంఘటనపై స్పందిస్తూ విలేఖరులతో మాట్లాడుతూ ఇలంటి సంఘటనలు జరగడం బాధాకరమని, మిషన్ కాకతీయ పనులు జరిగిన చెరువుల్లో చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఈ కుటుంబాలకు డబుల్ బెడ్ రూములు, వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందిస్తామన్నారు.