ప్రకాశం

పార్లమెంటు ఎన్నికలపై మాగుంట దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 24: రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యూహత్మాకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అందులోభాగంగానే తాను మళ్ళీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తానని మాగుంట దర్శి బహిరంగసభలో ప్రకటించారు. జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయకమిటీ సమావేశం దర్శిలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా దర్శిని వేదికగా చేసుకుని మాగుంట వ్యూహాత్మకంగా తాను ఎంపి అభ్యర్థిగా పోటీచేస్తానని శాసనసభ్యునిగా శిద్దా రాఘవరావు పోటీ చేస్తారని అందువలన ఇద్దరిని భారీమెజార్టీతో గెలిపించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలో తొలిసారిగా జరిగిన దర్శి నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువుగా ఉన్నారు. దీంతో తాను మళ్లీ పోటీచేస్తానని అందువలన తనను మళ్ళీ అదరించాలని వ్యూహాత్మాకంగానే వారికి పిలుపునిచ్చినట్లయ్యింది. ఈ నియోజకవర్గంలో రెడ్డిసామాజికవర్గానికి చెందిన వారు సుమారు 30వేలకుపైగానే ఉన్నారు. దీంతో ఆ సామాజికవర్గానికి నేనున్నంటూ భరోసా ఇచ్చేవిధంగా సంకేతాలను మాగుంట ఈ బహిరంగసభ ద్వారా ఇచ్చినట్లయ్యిందని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. అదే విధంగా రెండవ జిల్లాకార్యవర్గసమావేశం కనిగిరిలో జరగనుంది. కనిగిరిలోను ఇదే విషయాన్ని మాగుంట ప్రకటించి వారి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేయనున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. రాష్ట్రంలోనే కనిగిరి నియోజకవర్గంలో రెడ్డిసామాజికవర్గానికి చెందిన ఎక్కువుగానే ఉన్నారు. దీంతో అక్కడ కూడా ఇదేవిషయాన్ని ప్రస్తావించనున్నట్లు తెలిసింది. ఈ రెండునియోజకవర్గాల్లోను ఎక్కువుగానే ఆయన సామాజికవర్గానికి చెందిన వారు ఉండటంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన మంత్రి, శాసనసభ్యుడు తనవర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాలనే బహిరంగంగానే ఈ వ్యాఖ్యానాలు చేసినట్లు తెలుస్తొంది.
ఇదిఇలాఉండగా జిల్లాలోని కొంతమంది శాసనసభ్యులు మాగుంట అనుచరులను దూరం పెడుతూ వారిఅనుచరగణానికి నామినేటెడ్ పనులతోపాటు, పలు పదవులను కట్టబెడుతున్నారు. దీంతో మాగుంట అనుచరులు పార్టీపరంగాను, ప్రభుత్వపరంగా వచ్చే తాయిలాలు అందక నష్టపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో తన వర్గాన్ని పూర్తిస్ధాయిలో కాపాడుకునేందుకే ముందస్తు హెచ్చరికగా నేతలకు ఈబహిరంగ ప్రకటన చేసారన్న వాదన ఆ పార్టీనేతల నుండే వినిపిస్తొంది. కొన్ని నియోజకవర్గాల్లోని శాసనసభ్యులు దుందుడుకుగా వ్యవహరిస్తూ మాగుంటను సైతం వివిధ శంకుస్థాపనల కార్యక్రమాలకు, సమావేశాలకు పిలవకుండా దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నేపధ్యంలో రానున్న రోజుల్లో అలాంటివాటికి కొంతమంది శాసనసభ్యులు స్వస్తిచెప్పేందుకు కూడా మాగుంట ఇలాంటి వ్యాఖ్యానాలు చేశారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మొత్తంమీద జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోను ఇదే ప్రచారం చేసేందుకు మాగుంట సమాయత్తమైనట్లు తెలుస్తోంది.
ఇదిఇలాఉండగా ఇటీవల జిల్లాస్థా యినేతలతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలోనూ మాగుంట మళ్లీ ఎంపిగా పోటీచేస్తారని ప్రకటించారు. అప్పటి నుండి ఈ విషయం పెద్దగా ప్రచారంలోకి రాకపోయినప్పటికి దర్శి వేదికను మాత్రం మాగుంట వ్యూహత్మాకంగానే తీసుకుని ప్రకటించినట్లు తెలుస్తొంది. మొత్తంమీద రానున్న ఎన్నికల్లో వైసిపి తరపున మళ్లీ వైవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరుపున మాగుంట శ్రీనివాసులరెడ్డి తలపడనున్నారు.