రాష్ట్రీయం

ఆపరేషన్ టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల/ షాబాద్, జూన్ 23: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఇక్కారెడ్డిగూడా గ్రామంలో బోరు బావిలో పడిన చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ప్రమాదంలో ఇరుక్కుని 24 గంటలు గడవటంతో పాప పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గురువారం సాయంత్రం నుంచి అధికారులు నిరంతరంగా నాలుగు ఇటాచీలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్న ఎలాంటి ఫలితం లేకపోయింది. సంఘటన స్థలానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, సిపి సందీప్ శాండిల్య, చేవెళ్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ గొపీరామ్ దగ్గర ఉండి చర్యలు తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం నుంచి చిన్నారిని కాపాడేందుకు నాలుగు టీములు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. నల్గొండ నుంచి వచ్చిన రిస్క్యూటీమ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, మంగళగిరి నుంచి వచ్చిన బృందం అధునాతన పద్ధతిలో పైపులకు రోబో చేతులు అమర్చి పాపను రక్షించేందుకు ప్రయత్నించారు. మరో టీము చైన్ పూలింగ్ పద్ధతిలో, అందులోని మోటార్‌తో పాటు చిన్నారిని తీసేందుకు ప్రయత్నించగా పది ఆడుగులపైకి వచ్చి జారి పడిపోయింది. కేవలం మోటార్ పైపును బయటకు తీశారు. సమాంతరంగా జరుపుతోన్న తవ్వకాల కారణంగా భూమి అదిరి చిన్నారి మరింత లోతుకు జారిపోయి ఉంటుందని భావిస్తున్నారు. కనీసం 80 అడుగుల కిందకు జారిపోయి ఉండొచ్చని, పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని తెలుస్తోంది. అయితే, 80 అడుగుల లోతుకు సమాంతర గొయ్యి తవ్వడం కష్టం కనుక, శనివారం ఓఎన్‌జిసి, ఎల్ అండ్ టి నిపుణుల సాయం తీసుకుని ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారి ఎంత లోతులో ఉందో ప్రత్యేక కెమెరాలకు కూడా అందకపోవడం, వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుండటంతో చిన్నారి పరిస్థితిపై మరింత ఆందోళన నెలకొంది. 24 గంటలుగా కలెక్టర్ రఘునందన్ రావు సహాయక చర్యల్లో నిమగ్నమై రెస్క్యూ బృందాలతో చిన్నారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారు. చిన్నారి కోసం మళ్లీ ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో హిటాచీలతో తవ్వి చిన్నారిని తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జిల్లా పాలన వ్యవస్థ ఎప్పటికప్పుడు తగ్గిన చర్యలు చేపట్టింది. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి నిర్విరామంగా చిన్నారికి 108 సిబ్బంది ఆక్సిజన్ అందిస్తున్నారు. నగరంలోని పలు ఆసుపత్రిల నుంచి పాప ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది వచ్చారు. పాప ఎప్పడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. బోరుబావిలో పడిన చిన్నారి తల్లిదండ్రులను మాజీ మంత్రి సబితారెడ్డి ఓదార్చి ధైర్యం చెప్పారు. పాప ప్రాణాలతో బయటపడే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హమీచ్చారు.

చిత్రం.. పెద్దఎత్తున సాగుతోన్న సహాయక చర్యలు, (ఇన్‌సెట్‌లో) బోరుబావిలో పడిన చిన్నారి