'క్లాప్' కొట్టు గురూ!

ఇక టార్గెట్ బాలీవుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ శ్రుతిహాసన్ టార్గెట్ ఇక బాలీవుడ్డేనట. దక్షిణాదితోపాటు హిందీలోనూ రాణిస్తున్న ఈ అమ్మడు తన దృష్టి అంతా ఇక నుంచి హిందీ చిత్రాలపై పెట్టాలనుకుంటోందిట. తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరచుకున్న ఈ బ్యూటీ చాలా కాలంగా హిందీ చిత్రాల్లో రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందట. ఈ విషయం గురించి శ్రుతిని కదిలిస్తే- ‘‘ నటి అన్నాక అన్ని భాషల్లో చేయాలి. అలా చేసినప్పుడే గుర్తింపు లభిస్తుంది. ఆ విధంగా మంచి ఇమేజ్‌కూడా వస్తుంది. నేను తెలుగులో చేసిన చిత్రాలు నాకు మంచి ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. నా పాత్రలను ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఫలితంగా అతి కొద్ది కాలంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించగలిగాను. పరిశ్రమ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించి మంచి అవకాశాలను కల్పించింది. వాటిని నేను చక్కగా సద్వినియోగం చేసుకున్నాననే అనుకుంటున్నా. ఇక హిందీ చిత్రాలంటారా..? అక్కడ చేస్తే మనకు మరింత గుర్తింపు లభిస్తుంది. అందుకే ఇక అక్కడే ఎక్కువ చిత్రాలు చేయాలనుకుంటున్నా’’అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..శ్రుతి!!