కృష్ణ

వీడిన హత్య కేసు మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 24: కంకిపాడు పోలీస్టేషన్ పరిధిలో జరిగిన మంగళగిరి నివాసి షేక్ రఫీ(26) హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య చాలాకాలంగా నెలకొన్న కుటుంబ విభేదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈమేరకు డిసిపి క్రాంతిరాణా టాటా తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామ చైతన్య కళాశాల ఎదురుగా డొంకరోడ్డులో ఈ నెల 21న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో షేక్ రఫీ హత్యకు గురైన విషయం తెలిసిందే. రఫీ తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిని కలిసేందుకు తన స్నేహితుడు షేక్ జబ్బార్ అలియాస్ మున్నాని తోడుగా తీసుకుని మంగళగిరి నుంచి ఇక్కడకు వచ్చి హత్యకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే అతన్ని ప్రత్యర్థులు హతమార్చాలనే ప్రణాళికలో భాగంగానే ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలా పరిచయమైనట్లు పోస్టింగ్‌లు పెట్టి వ్యూహాత్మకంగా ఇక్కడకు వచ్చేలా చేసి హతమార్చినట్లు దర్యాప్తులో తేటతెల్లమైంది. దీంతో నిందితులుగా గుర్తించిన గాజుల గోపీనాథ్, పాల చంటి, గాజుల లక్ష్మి, గాజుల మల్లిక, పాల రాణి, గాజుల కృష్ణవేణి అనే ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి మూడు కత్తులు, పచ్చడిబండ, ఒక సెల్‌ఫోను, ఆటో స్వాధీనం చేసుకున్నారు. పాల బ్రహ్మయ్య అనే వ్యక్తికి అతని అన్న కొడుకు పాల చంటి, అన్న కూతురు గాజుల లక్ష్మి కుమారుడైన కనకారావుకు గతంలో కలహాలున్నాయి. దీంతో తన అల్లుడు షేక్ నాగూర్ సాయంతో బ్రహ్మయ్య మే 2న గుంటూరు జిల్లా మంగళగిరి హైవేపై కనకారావును హత్య చేయించాడు. దీంతో రెండు వర్గాల మధ్య మరింత కక్షలు పెరిగాయి. ఇదే క్రమంలో నాగూర్ తమ్ముడైన షేక్ రఫీతో కూడా కనకరావు వర్గీయులపై బ్రహ్మయ్య మళ్లీ హత్యలపరంపర సాగిస్తాడనే భయంతో రఫీని లక్ష్యంగా చేసుకున్న నిందితులు వ్యూహాత్మకంగా ప్రణాళిక రచించి గుంటూరు జిల్లాలో తెలిసిపోతుందని కృష్ణా జిల్లా కంకిపాడుకు మకాం మార్చి హత్య చేసినట్లు డిసిపి తెలిపారు. అరెస్టయిన నిందితులంతా కనకారావు వర్గానికి చెందిన ఒకే కుటుంబంలోని వ్యక్తులని చెప్పారు. విలేఖరుల సమావేశంలో ఏసిపి విజయభాస్కర్, సిఐ శ్రీ్ధర్, తదితరులు పాల్గొన్నారు.