కృష్ణ

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 24: ఓ వైపు పార్టీని బలోపేతం చేసుకుంటూనే.. మరోవైపు పాలనాపరంగా ప్రజాసమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని ఇందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ప్రజాప్రతినిధులు, నేతలకు ఆర్థిక మంత్రి, జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి, బందరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి యనమల రామకృష్ణుడు సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఈమేరకు నిర్ణయించింది. కృష్ణాజిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందజలో ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని అంశాలపై ఏంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో సమీక్షించారు. జిల్లాలోని పెండింగ్ పనులు, రోడ్డు నిర్మాణాలు, ఇళ్ళ నిర్మాణాలు, స్థలాల కేటాయింపు, చెరువుల నిర్మాణం, కొల్లేరు ఉప్పుటేరు, విజయవాడ- బందరు హైవే విస్తరణ పనులు, ఇక్కడ అండర్ పాసింగ్ నిర్మాణాలు, విస్తరణ సందర్భంగా భూములు వదులుకున్న వారికి చెందాల్సిన ప్రత్యామ్నయ చెల్లింపులు వంటి కీలక అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న పలు సమస్యలు, పెండింగ్ అంశాలతోపాటు పార్టీ పరంగా కూడా నేతల మధ్య ఉన్న విభేదాలపై కూడా చర్చించినట్లు సమాచారం. వీటన్నింటిపై కూలంకషగా సమీక్షించిన యనమల నేతలకు దిశాదశా నిర్ధేశం చేసినట్లు తెలిసింది. అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బందరు పార్లమెంటు నియోజకవర్గంతోపాటు జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా తాను కొనసాగుతున్నందున పార్టీ, పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ఇది రెండో సమావేశంగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల వద్దకు వెళ్ళేలా కార్యక్రమాలు రూపొందించుకుని ఈనెల 5వ తేదీన ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, అభివృద్ధి పనులపై ఆరా తీస్తామన్నారు. అదేవిధంగా పదో తేదీన మరో సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యకర్తల స్థాయి నుంచి మండలాల వారీగా పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలను విధిగా కలిసి మాట్లాడాలని, పర్యటనలు ఖరాలు చేయాలని సూచించామన్నారు. స్ధానిక సమస్యలపై అభిప్రాయ సేకరించి వాటి పరిష్కారానికి క్యాబినెట్‌లో చర్చిస్తామన్నారు. అందరూ భాగస్వాములై సమిష్టిగా పార్టీ బలోపేతం, జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే కృష్ణాజిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఏంపి కొణకళ్ళ నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పంచుమర్తి అనురాధ, బండారు హనుమంతరావు, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, ఉప్పులేటి కల్పన కాగిత వెంకట్రావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.