మహబూబ్‌నగర్

నాసిరకంగా ఫనులు చేస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నాసిరకంగా చేస్తే సహించేదిలేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని ఎల్లూరు గ్రామం సమీపంలో జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లిప్టుపనులను, కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వం ఏ పని చేపట్టిన ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, నాసిరకం పనులకు తావులేకుండా పారదర్శకంగా ఉంటూ ప్రజలకు జవాబుదారిగా పని చేస్తున్నదని అన్నారు. అనంతరం పట్టణంలోని పారిశుద్ద్య పనులలోను, రహదారులను శుభ్రపర్చుటలోను సరిగా విధులను నిర్వహించడంలేదనే ఫిర్యాదులు అందుతుంటే కమీషనర్‌గా మీరు ఏమి చేస్తున్నారంటూ నగరపంచాయతీ కమీషనర్ రామలింగంను ఆయన మందలించారు. విధుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరపంచాయతీలో 162 మంది సిబ్బంది ఉన్నారని, ఎవ్వరెవ్వరికి షిప్టుల వారిగా పనులు అప్పగిస్తున్నట్లు కమీషనర్ మంత్రి దృష్టికి తెచ్చారు. పని చేయని సిబ్బంది ఉన్నా, అధికారుల మాట వినకున్నా వారిని పనుల నుంచి తొలగించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ఈనెల 29న పట్టణంలో ప్రధాన వీధులలో తిరిగి పారిశుద్ధ్యం, రహదారుల శుభ్రత తదితర వాటిపై ఆయా కాలనీల ప్రజల అభిప్రాయాలను తీసుకుంటానని మంత్రి వెల్లడించారు. ఇప్పటికైనా స్పందించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన నగరపంచాయతీ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఇరువైపుల రహదారి పక్కన నాటిన మొక్కలను పర్యవేక్షించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఎంపిపి నిరంజన్‌రావు, నాయకులు నర్సింహ్మారావు, మేకల రాముడు, మద్దిలేటి తదితరులు ఉన్నారు.