శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విద్యాశాఖ హెచ్చరికలు తాటాకు చప్పుళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 25: జిల్లాలో ఎక్కడా ఒలింపియాడ్, టెక్నో, కానె్సప్ట్ స్కూళ్లంటూ ఉండరాదనే విద్యాశాఖ హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేయడం లేదు. రికార్డుల్లో అనుమతులు పొందిన పేర్లతోనే బోర్డుపై పేర్లుండాలన్నా ఎవరూ పట్టించుకోకపోవడం విచారకరం. అయితే ఏ ఊరిలో చూసినా పెద్ద సంఖ్యలోనే టెక్నో, ఒలింపియాడ్, కానె్సప్ట్ స్కూళ్లు కనిపిస్తుండటం విడ్డూరం. ఇదేమని జిల్లా విద్యాధికారి వద్ద ప్రస్తావిస్తే ఆయా మండలాల విద్యాధికారులు, డిప్యూటీ డిఇఓలదే ప్రధాన బాధ్యత అంటూ తప్పించుకుంటున్నారు. వారితోపాటు హైస్కూల్ హెచ్‌ఎంలతో కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్తున్నా ఇప్పటికే అన్ని ప్రైవేట్ స్కూళ్లలో దండకాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. ఆయా సంస్థల్లో తమ సంతతిని చేర్పించినందున తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి. నెల్లూరు జిల్లాలో సుమారు ఏడువందల వరకు గుర్తింపు పాఠశాలలు మాత్రమే ఉండాలి. అయితే అనధికారికంగా నడుస్తున్న పాఠశాలల సంఖ్య వేలల్లోనే ఉండటం విమర్శలకు తావిస్తున్న పరిణామం. ప్రభుత్వ క్యాలండర్ ప్రకారం మాత్రమే ప్రారంభించాలని సెలవిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. అలాగే నగర, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉదయం తొమ్మిదిగంటల్లోపు, సాయంత్రం ఐదుగంటల తరువాత కూడా నిర్వహించేలా తరగతుల కాల ప్రణాళికలుండటం శోచనీయం. ఇదిలాఉంటే గుర్తింపులేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామనే బహిరంగ ప్రకటనలన్నీ విద్యాశాఖ మామూళ్ల మత్తుతో సద్దుకుంటున్నాయి. గత విద్యాసంవత్సరం చివరిలోనే ఇందుకు సంబంధించి ఎనిమిది అంశాలతో అన్ని మండలాలకు పంపించిన నివేదికలు కార్యాచరణలో అటకెక్కుతున్నాయి. గుర్తింపులేని పాఠశాలల్ని మూతవేయాలని ఎంఇఓలకు హుకుం జారీ చేసినా అలాంటి చర్యలేమి తీసుకోకపోవడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఏటేటా గుర్తింపులేని ప్రైవేట్ స్కూళ్లు పెద్ద సంఖ్యలోనే ప్రారంభమవుతున్నా వాటిని అడ్డుకునే విద్యాధికారే కరవు. అలా గుర్తింపులేకున్నా ఫీజుల వసూళ్లలో మాత్రం చాలా ఎక్కువ మోతాదుతో వ్యవహరిస్తుండటాన్ని సర్వత్రా తప్పుబడుతున్నారు. కొన్ని స్కూళ్లకు సంబంధించి ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లోనే గుర్తింపు ఉన్నప్పటికీ ఉన్నత పాఠశాల వరకు కూడా అడ్మిషన్లు నిర్వహించి తరగతులు ప్రారంభించడం గమనార్హం. ప్రధాన ఫీజులతోపాటు ఇతర వసూళ్లు కూడా అంతూదరి లేని రీతిలో సాగిస్తున్నారు. తొలిగా ఆయా సంస్థల్లో చేరే విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు అంటూ దండుకుంటున్నారు. అలాగే విద్యాసంస్థకు సమీపంలో ఉన్న విద్యార్థికైనా సుదూరం నుంచి వచ్చే బాల బాలికలకైనా ఒకే తరహా వ్యాన్ ఫీజు మొత్తాల్ని వసూళ్లు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అందరినీ సుదూర ప్రాంతాల నుంచే తీసుకొస్తున్నట్లుగా వ్యాన్ ఫీజులు ఉంటున్నాయి. గుర్తింపు సంస్థలైనప్పటికీ వసూలు చేసే ఫీజు మొత్తాల్ని ఆయా పాఠశాలల నోటీస్ బోర్డులపై బహిరంగంగా ప్రకటించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ఏ పాఠశాలలోనూ అమలు కావడం లేదు. స్కూల్‌లోనే పాఠ్య, నోట్ పుస్తకాలతోపాటు యూనిఫారమ్‌లు కూడా విక్రయిస్తూ బహిరంగ మార్కెట్‌లో ఉండే ధరల కంటే ఎక్కువగా గుంజడాన్ని తల్లిదండ్రులు తప్పుబడుతున్నా విద్యాసంస్థల నిర్వాహకుల్లో పరివర్తన కరవు.