శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విద్యతోనే మైనార్టీ వర్గాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జూన్ 25: జిల్లాలోని ముస్లిం విద్యార్థినుల కోసం ప్రభుత్వం రెసిడెన్షియన్ మహిళా కళాశాలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నగరంలోని బిఎం ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశానికి మంత్రి నారాయణ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతోనే ముస్లిం కుటుంబాల్లో పేదరికం తొలగి అన్నివిధాలుగా అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా రాష్ట్ర బడ్జెట్‌లో ఈ ఏడాది 1962 కోట్ల రూపాయలను కేటాయించి ముస్లిం సామాజికవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలకు టిడిపి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలోని 1.35 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు స్కాలర్‌షిప్ 1.13 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించామన్నారు. ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాలల సంఖ్యను 6 నుండి 20కి పెంచామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 12 కోట్లతో షాదీమంజిల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. కడపలో నూతనంగా హజ్‌హౌస్ నిర్మాణం జరుగుతోందన్నారు. అదే నమూనాతో విజయవాడ, కర్నూలు జిల్లాలో మరో రెండు హజ్‌హౌస్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపుదిద్దుకున్న దుల్హన్ పథకంతో ఎన్నో ముస్లిం కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రాముఖ్యత సంతరించుకున్న దుల్హన్ పథకం కేటాయింపు నిధులను వంద కోట్లకు పెంచుతున్నట్లు చెప్పారు. ముస్లిం ప్రజల సంక్షేమానికి అవసరమైన మంచి పథకాలను తెలియచేస్తే వాటికి కార్యరూపం కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రకటించిన 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఇప్పటి వరకు అమలులోకి రాలేదన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు ఏర్పాటు చేసిన మైనార్టీ మేధావుల కమిటీలో చంద్రబాబు తనకు స్థానం కల్పించారని తెలిపారు. రాష్ట్రంలోని ముస్లిం ప్రజలందరి సంక్షేమానికి సంబంధించిన రిజర్వేషన్ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా కృషి చేయాలని సిఎం సూచించారని పేర్కొన్నారు. విద్యకు పేదరికం అడ్డుకాదని ఖర్చులేకుండా ఉన్నత విద్యావంతులయ్యే అవకాశాలు టిడిపి ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కల్పిస్తోందన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని 140 మసీదులకు అవసరమైన మరమ్మతులు, ముస్తాబు, పండుగ నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులను విడుదల చేసిందని తెలిపారు. అనంతరం మసీదుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను మంత్రి అందేశారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, మత పెద్దలు అబూబకర్, వౌలానా, టిడిపి నాయకురాలు అనూరాధ, ఆనం జయకుమార్‌రెడ్డి, ఖాజవలి, కొండ్రెడ్డి రంగారెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు, ననే్నసాహెబ్, మొయునుద్దీన్, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.