కరీంనగర్

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక, జూన్ 26: మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బండ సంపత్ (28) అలియాస్ సిద్ధు అనే అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు జమ్మికుంట గ్రామీణ సిఐ నారాయణ, వీణవంక ఎస్‌ఐ దామోదర్ రెడ్డిలు సోమవారం తెలిపారు. వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఖాసిపేట మండలం సోమగూడెంకు చెందిన బండ సంపత్ చిన్నతనం నుండి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పట్టపగలు, రాత్రివేళల్లో ఇండ్లకు తాళాలు వేసి ఉంచగా వాటిని ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సిఐ తెలిపారు. పోలీస్ నిఘా తీవ్రతరం కావడంతో అతని కార్యకలాపాలు జమ్మికుంట, వీణవంక మండలాలలో కొనసాగించాడు. ఇతనిపై 45 దొంగతనాల కేసులు నమోదు కాగా, తిరిగి బెయిల్‌పై వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో జమ్మికుంటలోని లెక్చరర్స్ కాలనీలో ఇటీవల దొంగతనానికి పాల్పడి మూడు తులాల బంగారు గొలుసు, 18 తులాల వెండి ఆభరణాలు దొంగిలించాడు. అనంతరం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఒక ఇంటిలోని సెల్‌ఫోన్, 1500 నగదు దొంగిలించాడు. సోమవారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిజం వెళ్లడించినట్లు సిఐ తెలిపారు. 15 సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతున్న సంపత్ వద్ద మూడు లక్షల 90 వేల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాకచౌక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది అశోక్ రెడ్డి, శ్రీనివాస్, రఘు, తిరుపతిలను సిఐ అభినందించారు.