గుంటూరు

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జూన్ 26: మానవత్వం పరిమళించడానికి, సమతా, మమతా, మానవతా భావాలు పెంపొందించడానికి బాటలు వేసే మహాపర్వదినాల్లో విశిష్ఠమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని సోమవారం నగరంలోని ప్రధాన ఈద్గాల వద్దకు వేలాది మంది ముస్లింలు వయోభేదం లేకుండా, తమ చిన్నారులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య తరలివెళ్లి ఈ జన్మను ప్రసాదించిన దయామయుడు, ప్రేమ స్వరూపుడైన అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విశేష ప్రార్థనలు చేశారు. ఆదివారం సాయంత్రం షవ్వాల్ (నెలవంక) కన్పించడంతో రంజాన్ వేడుకలు ప్రారంభించారు. ఢిల్లీలోని జమా మసీదు, లక్నో, హైదరాబాద్‌లలోని ప్రధాన మసీదుల వౌలానాలు, ముఫ్తీలు, మతపెద్దల సూచనలకు అనుగుణంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదుల్ ఫితర్ పండుగను శ్రద్ధాసక్తులతో, భక్త్భివాలతో జరుపుకున్నారు. తరాలీనమాజ్, ఖురాన్ పఠనాలను 30 రోజుల పాటు పఠించి, ఉపవాస దీక్షలను విరమించి సంప్రదాయబద్ధంగా ఖర్జూర పండ్లను స్వీకరించారు. మసీదులలో అల్లాహ్ అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ ఏతికాఫ్ చేసి పేదలకు జకాత్ చెల్లించారు. రంజాన్ మాసంలో దీక్షలను నియమ నిష్టలతో ఆచరించడం వలన తదనంతర కాలంలో లభించే ప్రతిఫలాలు శాశ్వతంగా ఉండాలని ఈద్గాలకు భారీగా తరలివచ్చి అందరిపేరిట, విశ్వశాంతిని కోరుతూ నమాజ్ చేశారు. ముస్లింలు షేర్ కుర్మా సేమియా పాయసం సేవించి ఈద్గాలకు సంప్రదాయ వస్త్రాలను ధరించి రావడంతో ఆ ప్రాంతాలన్నీ కళకళలాడాయి. నగరంపాలెంలోని ప్రధాన ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనలో నమాజ్ కోసం వచ్చిన 30 వేల మంది ముస్లింలను ఉద్దేశించి వౌలానా ముఫ్తీ అరబ్బీ భాషలో రంజాన్‌పండుగ ప్రాధాన్యతను సమగ్రంగా తెలియజేశారు. మానవ జీవితంలో వెలుగునింపి ప్రేమమూర్తిగా మారేందుకు రంజాన్ ఉపవాస దీక్షలు, పండుగ దోహదం చేస్తాయని ముఫ్తి ఉద్బోధించారు. పలువురు చిన్నారులు ప్రార్థనలకు తరలివచ్చి పెద్దలతో పాటు సమానంగా నమాజ్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా ఉండగా పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన రంజాన్ నమాజ్‌లో అసంఖ్యాక ముస్లింలు పాల్గొన్నారు.