గుంటూరు

ఈద్గా వద్ద టిడిపి, వైసిపి ముస్లింల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, జూన్ 26:రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద సోమవారం టిడిపి, వైసిపి ముస్లింలు స్వల్ప వివాదానికి దిగారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి ముస్లింల ఆహ్వానం మేరకు రంజాన్ ప్రార్థనలలో పాల్గొనేందుకు ఈద్గా వద్దకు వచ్చారు. ముస్లింలకు ఇన్‌చార్జి చలమారెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసేందుకు టిడిపికి చెందిన ముస్లింలు మైక్ ఇవ్వమని అడిగారు. దీనికి నిరాకరించిన వైసిపి ముస్లింలు చలమారెడ్డి ప్రసంగించటానికి వీలులేదని, నమాజ్‌లో కూర్చోవాలని అనటంతో ఇరువురి మధ్య స్వల్ప వివాదం జరిగింది. గతంలో శుభాకాంక్షలు తెలియజేయటానికి చలమారెడ్డి వచ్చారని, ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నారని టిడిపి ముస్లింలు అన్నారు. కొంచెంసేపు ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరగటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువురు గొడవపడవద్దని అర్బన్ సి ఐ సత్యకైలాస్‌నాథ్, ఎస్సైలు లక్ష్మయ్య, నారాయణలు సర్దిచెప్పటంతో వివాదం ముగిసింది. దీంతో చలమారెడ్డి ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లింలు ప్రశాంతంగా నమాజ్ చదువుకున్నారు.