గుంటూరు

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూన్ 27: జిల్లాలోని అన్ని గ్రామాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులు పారిశుద్ధ్యంపై దృష్టిసారించి, ప్రజలు అంటురోగాల బారినపడకుండా చూడాలని జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కాటూరి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక సీతారాం నగర్‌లోని జిల్లా సర్పంచుల సంఘ కార్యాలయంలో సర్పంచ్‌ల సంఘ సమావేశం అఖిలభారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు అధ్యక్షతన జరిగింది. గరికపర్రులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులను బహిష్కరించి అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలని సమావేశం తీర్మానించింది. సభాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖ మొబైల్ వ్యాన్‌ల ద్వారా సంచార వైద్యశాలలను ఏర్పాటుచేసి గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అవగాహన కల్పించడంతో పాటు వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శులు వంగవోలు సాంబశివరావు, గౌస్ సంధాని, ఎస్సీ సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షురాలు నానెం సుజాతాకిషోర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గోగినేని వసుధ, గౌరవ అధ్యక్షులు కళ్లెం పానకాలరెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఇటీవల మృతిచెందిన శామల్యాపురం మండలం గుంటుపల్లి సర్పంచ్ పచ్చవ కోటేశ్వరమ్మ మృతికి సంతాపం తెలియజేశారు.