మెయిన్ ఫీచర్

సొగసు చూడతరమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిల్కు చీరలు అంటే అతివలకు ఎనలేని మోజు. సొగసైన వీటి అందం, హుందాతనం వేరేవాటితో రాదు అంటే అతిశయోక్తి కాదు. మహిళల వార్టురోబ్‌లో సిల్క్ చీరలు ఓ భాగమయ్యాయి. ఏ కాలంలోనైనా ఫ్యాబ్రిక్‌కు డిమాండ్ ఉంటుంది. మనదేశంలో ప్రసిద్ధిచెందిన మైసూర్ సిల్క్ చీరలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. వివిధ దేశాధినేతలు తమ భార్యలతో కలిసి మనదేశ పర్యటనకు వస్తే ఈ మైనూర్ సిల్క్ చీరలనే బహుమతులుగా అందించే ఆనవాయితీ కూడా ఉంది. చినుకుపడే వేళ మనం ధరించే దుస్తుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాకాలంలో కాస్త ముదురు రంగుల్లో సిల్క్ చీరలు ధరిస్తే తడిసినా త్వరగా ఆరిపోతాయి. రుతువులు మారినట్లే సిల్క్ చీరల రంగులు.. ఎంపికలో ప్రధాన భూమిక పోషిస్తాయి. డిజైనర్లు సరికొత్త హంగులు, రంగులు అద్దుతున్నారు. సిల్క్‌లో భగల్పూరి ప్రింట్, మాల్గుడి ఆర్ట్, తుస్సార్ సిల్క్ చీరలు ఇంట్లో, ఆఫీసుల్లో కట్టుకునేందుకు వీలైన డిజైన్లతోపాటు చిన్న చిన్న పార్టీలు, వేడుకలకు కట్టుకెళ్లేందుకు వీలుగా మార్కెట్లో లభిస్తున్నాయి. జరీ బోర్డర్, ఎంబ్రాయిడరీ చేసిన చీరలను ధరించేందుకు వివాహ వేడుకలకు మహిళలు ఇష్టపడుతున్నారు. వయసు మీదపడినా ఇప్పటికీ ఇండియన్ బ్యూటీగా పిలుచుకునే బాలీవుడ్ నటి రేఖా ట్రేడ్ మార్క్ సిల్క్ చీరే. అచ్చమైన భారతీయ స్ర్తికి నిదర్శనంగా కనిపించే విద్యాబాలన్ సైతం సిల్క్ చీరలనే ఇష్టపడుతుంది. హలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని సైతం ఎక్కువ ఫంక్షన్‌లకు సిల్క్‌చీరలతోనే హాజరవుతారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ విజయం తరువాత దీపికా పదుకునే సైతం సిల్క్ చీరలే వైపు మొగ్గుచూపుతున్నారు. దక్షణాది సినీతారలు, సెలబ్రిటీలు సైతం సిల్క్‌చీరలనే ఎక్కువగా ఇష్టపడారు. ఆషాడమాసం కావటంతో ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో సిల్క్ చీరలు ఆధునిక రూపాన్ని సంతరించుకుంటున్నాయి. యువతుల మేనికి మెత్తగా ఉండే ఈ చీరలు కళాశాలలో జరిగే ఫ్రెషర్స్ పార్టీ కోసం ధరిస్తే సౌఖ్యంగా ఉంటాయి. ఇక్కడ ఫొటోల్లో కనిపిస్తున్న చీరలనే చూడండి.. విభిన్న రంగులతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మల్టీకలర్స్‌లో సుతిమెత్తగా ఉండే ఈ సిల్క్ చీర సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. గ్లామరస్ లుక్‌తో అన్ని వేడుకలకు ఇది పనికొస్తుంది. ఈ ఫ్యాన్సీ డిజైనర్ చీరకు బెంగళూరు సిల్క్ బ్లౌజ్‌తో స్టయిల్‌గా కనువిందు చేస్తుంది. ఆరెంజ్ బ్లాక్ ప్రింటెడ్ భగల్పూరి సిల్క్ చీర కట్టుకుంటే ఒకటికి రెండుసార్లు చూడాలనిపించేలా ఉంటారు. ఉదా రంగులో మెరిసిపోతున్న కంజీవరం ఆర్ట్ సిల్క్ చీర సృజనాత్మకమైన నిపుణుల బృందం తయారు చేసింది. సమకాలీన రంగుల నాణ్యమైన వస్త్రశ్రేణి. తీరైనరీతిలో ఈ చీర కట్టుకుంటే శరీరాకృతికి కాంప్లిమెంట్ ఇచ్చేదిగా ఇమిడిపోతుంది. మెహందీ, బ్లూకలర్‌లో ఆకట్టుకుంటున్న ఈ తుస్సార్ సిల్క్ చీర కూడా పార్టీవేర్‌గా బాగుంటుంది. సిల్క్ చీరల్నీ, వాటి రంగులను చూసిన తరువాత ఏ జనరేషన్‌కైనా ఇట్టే నచ్చుతాయనటంలో సందేహం లేదు.

వయసు మీదపడినా ఇప్పటికీ ఇండియన్ బ్యూటీగా పిలుచుకునే బాలీవుడ్ నటి రేఖా ట్రేడ్ మార్క్ సిల్క్ చీరే. ఆమె ఏ ఫంక్షన్‌కు హాజరైనా సిల్క్ చీరలో మెరిసిపోతుంది. గోల్డెన్ సిల్క్ చీర, మెడలో బంగారు నెక్లెస్, చేతిలో పొట్లి బ్యాగ్‌తో సింపుల్‌గా కనిపించే రేఖ అందం ఏ ఫంక్షన్‌లోనైనా మంత్రముగ్ధులను చేస్తుంది.

ఆరెంజ్ బ్లాక్ ప్రింటెడ్ భగల్పూరి సిల్క్ చీర కట్టుకుంటే ఒకటికి రెండుసార్లు చూడాలనిపించేలా ఉంటారు.

ఊదా రంగులో మెరిసిపోతున్న కంజీవరం ఆర్ట్ సిల్క్ చీర సృజనాత్మకకు నిదర్శనంగా నిలుస్తుంది.

జాతీయ అవార్డు గ్రహీత విద్యాబాలన్ చీరకట్టుకు పర్యాయపదంగా నిలుస్తారు. ఆమె చీర కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుంది. సిల్క్ చీరలే తనకు సౌకర్యంగా ఉంటాయని చెబుతుంది. రేఖా బాటలోనే విద్యాబాలన్ కూడా నడుస్తూ ఏ ఫంక్షన్‌కు హాజరైనా సిల్క్ చీరలనే ధరిస్తారు. ఈమె చేతిలోనూ పొట్లీ బ్యాగ్ ఉంటుంది.

బ్లూకలర్‌లో ఆకట్టుకుంటున్న ఈ తుస్సార్ సిల్క్ చీర కూడా పార్టీవేర్‌కు బాగుంటుంది

ఈ ఫ్యాన్సీ డిజైనర్ చీరకు బెంగళూరు సిల్క్ బ్లౌజ్ ధరిస్తే స్టయిల్‌గా కనువిందు చేస్తోంది.