బిజినెస్

మార్కెట్‌లో ధరల మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 28: మార్కెట్‌లో ధరలు దడ పుట్టిస్తున్నాయి. సామాన్యుడు కూరగాయలను కూడా కొని తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే దుస్థితి కనిపిస్తోంది మరి. అది.. ఇది.. అనే తేడా లేకుండా కరివేపాకు దగ్గర్నుంచి కొత్తిమీరదాకా అటు ఆకు కూరలు, ఇటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
ముఖ్యంగా రిటైల్ మార్కెట్‌లో కిలో టమాట ధర 60-70 రూపాయలు పలుకుతోంది. ఇతర కూరగాయల రేట్లూ దాదాపు ఇంతేలా ఉన్నాయి. బీరకాయ, బెండకాయ, వంకాయ ఇలా అన్ని కూరగాయల ధరలు కిలో 50-60కి తక్కువగా లేవు. కిలో పచ్చి మిర్చీనైతే 100 రూపాయ ల పైమాటే. టమాట విషయానికే వస్తే దేశ రాజధాని ఢిల్లీ నుంచి మన ప్రక్కనున్న గల్లీ వరకు కిలో ధర 60-70 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో మదర్ డైరీ నిర్వహిస్తున్న సఫల్ ఔట్‌లెట్లలో కిలో టమాట 60 రూపాయలకు అమ్ముతున్నారు.
హైదరాబాద్ రిటైల్ దుకాణాల్లోనూ ఇదే ధర దర్శనమిస్తోంది. అయితే కోల్‌కతా, చెన్నై, ముంబయి వంటి కొన్ని మెట్రో నగరాల్లో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ.. నాణ్యత ఆధారంగా చూస్తే గరిష్ఠ స్థాయి ధరలు 50కి తక్కువగా లేవు. కాగా, నేచర్స్ బాస్కెట్, గ్రోఫర్స్ ఆన్‌లైన్ వేదికలపై 45-48 రూపాయలకు కిలో టమాట దొరుకుతోంది. సీజనల్ పరిణామాల వల్లే ధరల పెరుగుదల అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. కొత్త పంట మార్కెట్‌కు వచ్చేవరకు ధరల సంగతి ఇంతేనని వ్యాపారులు అంటున్నారు. పప్పు్ధన్యాల ధరలూ కిలో 70-80కి తగ్గకుండా ఉండటంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ తలకిందులైపోయింది.
‘నిజానికి టమాట పాడైపోయే ఉత్పత్తి. ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి వీలుండదు. అయినప్పటికీ రాష్ట్రాల్లో పరిస్థితులనూ గమనిస్తున్నాం. కృత్రిమ కొరత ఎక్కడా లేదు. సరఫరాలోనూ జా ప్యం జరగడం లేదు. అయినప్పటికీ గత వారం రోజులుగా ధరలు పెరుగుతూ పోతున్నాయి. ధరలు త్వరలోనే అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నాం.’ అని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పిటిఐతో అన్నారు.
అయితే డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్లే ధరల పెరుగుదల అని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. హర్యానాతోపాటు ఇతర టమాట ఉత్పాదక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 70 శాతానికిపైగా పంట దెబ్బతిన్నదని ఆసియా ఖండంలోనే పండ్లు, కూరగాయలకు అతిపెద్ద హోల్‌సేల్ మార్కెటైన అజద్‌పూర్‌లో టమాట వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న అశోక్ కౌశిక్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో షిమ్లా నుంచి మార్కెట్‌కు కొంతమేర టమాట వస్తోందని చెప్పిన ఆయన దక్షిణ భారతంలో వర్షాలకు పంట బాగా దెబ్బతిన్నదని, అక్కడి నుంచి రావడం లేదని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్, మహారాష్టల్ర నుంచే అక్కడకు టమాట సరఫరా అవుతోందని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ధరలకు రెక్కలొచ్చాయన్నారు. కాగా, అజద్‌పూర్ మార్కెట్‌లో కిలో టమాట ధర 15 రోజుల క్రితం 5 నుంచి 15 రూపాయల మధ్యే ఉంది. అయితే ఇప్పుడిది 20 నుంచి 50 రూపాయలకు పెరిగింది.
నిరుడు జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశీయంగా టమాట ఉత్పత్తి 187 లక్షల టన్నులుగా నమోదవుతుందని ప్రభుత్వ అంచనా. అంతకుముందు సంవత్సరం జూలై-జూన్‌తో పోల్చితే ఇది 15 శాతం అధికం. మొత్తానికి కూరగాయల ధరలు వినియోగదారులకు ఠారెత్తిస్తున్నాయి.